వైరలవుతున్న మీమ్స్‌.. పాపం ఆర్‌సీబీ

7 Nov, 2020 18:43 IST|Sakshi

దుబాయ్‌ : ‘ఈ సాలా కప్‌ నామ్‌దే(ఈసారి కప్పు మాదే) అంటూ ఐపీఎల్‌ 13వ సీజన్‌లో బరిలోకి దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మరోసారి నిరాశపరిచింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ చేతిలో ఓడిపోవడంతో మరోసారి ఒట్టి చేతులతో తిరిగి వచ్చింది.  ఈసారి కప్ కచ్చితంగా కొడుతామంటూ కోహ్లి అండ్‌ గ్యాంగ్‌ చేసిన శపథాలకు పాపం ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్‌ ఆశలను మోస్తూ ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఆర్‌సీబీ మొదటి అంచె లీగ్‌ మ్యాచ్‌లు ముగిసేసరికి 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి అంచనాలను మరింత పెంచేసింది.

రెండో అంచె పోటీలకు వచ్చేసరికి అసలు కథ మొదలయ్యింది. మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచినా.. తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓటమిపాలవడంతో ఆర్‌సీబీది మళ్లీ పాతకథే అయ్యింది. రన్‌రేట్‌ కాస్త మెరుగ్గా ఉండడం.. లీగ్‌ రెండో అంచెలో వరుస విజయాలతో రేసులోకి వచ్చిన పంజాబ్‌తో పాటు కోల్‌కతా, రాజస్తాన్‌లు కీలక మ్యాచ్‌ల్లో ఓటమిపాలవడంతో ఎలాగోలా ప్లేఆఫ్‌ చేరింది. అయితే ఒత్తిడికి మారుపేరుగా ఉండే ఆర్‌సీబీ శుక్రవారం ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పాతకథే పునరావృతమైంది. అసలు ఆడుతుంది ఆర్‌సీబీనేనా అన్నట్లు వారి ఆటతీరు ఉంది. అసలు సమయంలో రాణించాల్సింది పోయి ఒత్తిడికి తలొగ్గి ఓటమి పాలై నిరాశతో ఐపీఎల్‌ నుంచి నిష్క్రమించింది. ఈ విషయంలో ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సారీ కూడా చెప్పాడు. ఇది ఐపీఎల్‌ 13వ సీజన్‌లో స్థూలంగా ఆర్‌సీబీ కథ. (చదవండి : ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన డివిలియర్స్)‌

ఇక ఇప్పుడు సోషల్‌ మీడియా వంతు వచ్చింది. ఈ సాలా కప్‌ నామ్‌దే అంటూ బరిలోకి దిగి ఒట్టి చేతులతో వెనక్కిరావడం పట్ల ఆర్‌సీబీపై నెటిజన్లతో పాటు ఫ్యాన్స్‌, యాంటీ ఫ్యాన్స్‌ ఒక ఆట ఆడుకున్నారు. ఆర్‌సీబీపై వారు చేసిన మీమ్స్‌ ఇప్పుడు ట్రెండింగ్‌ గా మారాయి. సరదాగా వాటిపై ఓ లుక్కేయండి.

మరిన్ని వార్తలు