Viral Video: ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో అతిపెద్ద సిక్స్‌

25 Sep, 2021 18:12 IST|Sakshi

సిడ్నీ: ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో అతిపెద్ద సిక్స్‌ నమోదైంది. షెఫీల్డ్‌ షీల్డ్‌ 2021-22 టోర్నీలో భాగంగా అడిలైడ్‌ వేదికగా వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా, సౌత్‌ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా బ్యాటర్‌ హిల్టన్‌ కార్ట్‌రైట్‌ 122 బంతుల్లో 69 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కాగా అతను కొట్టిన మూడు సిక్స్‌ల్లో ఒకటి గ్రౌండ్‌ అవతల చాలా దూరంలో పడింది. ఇన్నింగ్స్‌ 114వ ఓవర్‌ నాలుగో బంతిని స్ట్రెయిట్‌ సిక్స్‌గా బాదాడు. ఫీల్డర్‌కు క్యాచ్‌ తీసుకునే అవకాశం లేకుండా మైదానం అవతల రోడ్డుపై పడింది. కనీసం బంతి ఎక్కడ పడిందో అని చూద్దామని అనుకున్నా కెమెరా కంటికి  చిక్కలేదు. ఇంతలో ఒకతను వచ్చి బంతిని మైదానంలోకి విసిరాడు. కాగా కార్ట్‌రైట్‌ కొట్టిన సిక్స్‌ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోనే అతిపెద్ద సిక్స్‌గా క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. 

చదవండి: T20 World Cup 2021: శ్రీలంక క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం

ఇక కార్ట్‌రైట్‌ 2017లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టుమ్యాచ్‌ ద్వారా ఆసీస్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే ఒక టెస్టుకు మాత్రమే పరిమితమైన అతను మూడు వన్డేలు ఆడాడు. కార్ట్‌రైట్‌ తన చివరి వన్డేను టీమిండియాపై ఆడగా.. కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో కుల్‌దీప్‌ యాదవ్‌ హ్యాట్రిక్‌ తీయడం విశేషం. ఓవరాల్‌గా ఆసీస్‌ తరపున టెస్టు, వన్డేలు కలిపి నాలుగు మ్యాచ్‌లాడి 57 పరుగులు చేశాడు. ఇక బిగ్‌బాష్‌ లీగ్‌లోనూ ఆడిన కార్ట్‌రైట్‌ 55 బీబీఎల్‌ మ్యాచ్‌ల్లో 924 పరుగులు సాధించాడు.

చదవండి: బౌండరీ కొట్టగానే శ్రీశాంత్‌ స్టైల్‌ను దింపేశాడు..

మరిన్ని వార్తలు