అతని సమయం వస్తుంది: గంగూలీ

5 Nov, 2020 15:33 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో పలువురు యువ క్రికెటర్లు వెలుగులోకి రావడంపై భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. ప్రధానంగా ఆరుగురు టాలెంటెడ్‌ ప్లేయర్స్‌ తమకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నారన్నాడు. ప్రస్తుత సీజన్‌తో ఏ ఒక్క ఆటగాడో వెలుగులోకి రాలేదని,  యువ క్రికెటర్ల బెంచ్‌లో చాలామంది ఆకట్టుకోవడం మంచి పరిణామమన్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌,  రాహుల్‌ త్రిపాఠి,  వరుణ్‌ చక్రవర్తి, శుబ్‌మన్‌ గిల్‌, సంజూ శాంసన్‌, దేవదూత్‌ పడిక్కల్‌లు తమలోని సత్తాను నిరూపించుకున్నారన్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌కు భారత జట్టులో చోటు దక్కలేదనే నేపథ్యంలో గంగూలీ స్పందించాడు. హిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ఈ ఐపీఎల్‌ కేవలం సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రమే ఆకట్టుకోలేదని, చాలామంది యువ క్రికెటర్లు మెరిశారన్నాడు.  దాంతో భారత క్రికెట్‌ జట్టులో కొంతమంది యంగ్‌ క్రికెటర్లకు చోటు దక్కిందన్నాడు. ఇక సూర్యకుమార్‌కు చాన్స్‌ ఇవ్వలేదనే వ్యాఖ్యల్ని గంగూలీ తనదైన శైలిలో దాటవేశాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ సమయం కూడా వస్తుందన్నాడు.  (రైట్‌ ఆర్మ్‌ క్విక్‌ బౌలరా.. కోహ్లి ఏంటిది!)

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టులో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు ఇవ్వకపోవడంపై హర్భజన్‌ సింగ్‌ తీవ్ర స్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. ‘సూర్యకుమార్‌ ఇంకేమి నిరూపించుకోవాలో తెలియడం లేదు. అతన్ని టీమిండియా జట్టులో ఎంపికయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. సూర్యకుమార్‌ ప్రతీ ఐపీఎల్‌లో రంజీ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నాడు. మన సెలక్షన్‌ కమిటీలో ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన రూల్‌ను అవలంభిస్తున్నారు. ఇందుకు ఇదే నిదర్శనం.  సెలక్టర్లు.. కనీసం అతని రికార్డులను చూడండి. ఇది నా రిక్వెస్ట్‌’ అని భజ్జీ తెలిపాడు. సూర్యకుమార్‌ను ఎంపిక చేయకపోవడాన్ని భజ్జీతో పాటు పలువురు ఖండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గంగూలీకి ఎదురైన ఒక ప్రశ్న ఎదురు కాగా, అతనికి సమయం వస్తుందన్నాడు. కొంతకాలం సూర్యకుమార్‌ యాదవ్‌ నిరీక్షించక తప్పదనే సంకేతాలిచ్చాడు దాదా. 

మరిన్ని వార్తలు