Hockey World Cup 2023: ఆఖరి వరకు ఉత్కంఠ.. డ్రాగా ముగిసిన భారత్‌- ఇంగ్లండ్‌ ‍మ్యాచ్‌

16 Jan, 2023 11:04 IST|Sakshi

పురుషుల హాకీ ప్రపంచకప్‌  గ్రూపు డిలో భాగంగా ఆదివారం భారత్‌- ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. దీంతో వరుసగా రెండో విజయం సాధించి టెబుల్‌ టాపర్‌గా నిలవాలన్న భారత్‌ కలనెరవేరలేదు. 60 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి వరకు ఇరు జట్లు హోరాహోరీగా పోరాడనప్పటికీ ఒక్క గోల్‌ కూడా సాధించలేకపోయాయి.

తొలి అర్థ భాగంలో భార‌త ఆట‌గాడు హార్ధిక్ సింగ్ గోల్ కోసం గ‌ట్టిగా ప్రయ‌త్నించి విఫ‌ల‌మ‌య్యాడు.  రెండో అర్థభాగంలో భారత్‌ పెనాల్టీ గోల్ వేసే అవకాశాలను కూడా చేజార్చుకుంది. మరోవైపు ఇంగ్లండ్‌ జట్టు కూడా పలు అవకాశాలు వచ్చినప్పటికీ సద్వినియోగపరుచుకోలేకపోయింది.

అదే విధంగా మ్యాచ్‌ ఆఖరి నిమిషంలో కూడా ఇంగ్లండ్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించింది. దీంతో స్టేడియం మొత్తం తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ ఆటగాడు పెనాల్టీ కార్నర్ ను గురి చూసి భారత్ పోస్ట్ పైకి కొట్టాడు. వెంటనే భారత గోల్‌కీపర్‌ పాఠక్‌ అడ్డుకోవడంతో అభిమానలంతా ఊపిరి పీల్చుకున్నారు.

దీంతో మ్యాచ్‌ 0-0తో డ్రాగా ముగిసింది. తద్వారా ఇరు జట్లకు  జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇక భారత్‌, ఇంగ్లండ్‌ తమ తొలి మ్యాచ్‌లలో విజయం సాధించడంతో ప్రస్తుతం ఇరు జట్ల ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. అయితే గోల్స్ పరంగా  ముందంజలో ఉన్న ఇంగ్లండ్‌ గ్రూపు-డి నుంచి టెబుల్‌ టాపర్‌గా నిలిచింది.
చదవండి: Steffi Graf: ఒ​కే ఏడాది 4 గ్రాండ్‌స్లామ్‌లతో పాటు ఒలింపిక్‌ స్వర్ణం నెగ్గిన ఆల్‌టైమ్‌ గ్రేట్‌

మరిన్ని వార్తలు