Asia Cup 2022: అర్హత సాధించామన్న ఆనందం.. 'కాలా చష్మా'తో దుమ్మురేపారు

27 Aug, 2022 09:58 IST|Sakshi
Photo Credit: ESPN Cricinfo Instagram

ప్రస్తుతం బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ సాంగ్‌ ''కాలా చష్మా'' సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఎక్కడ విన్నా ఇప్పుడు ఇదే పాట వినిపిస్తుంది. తాజాగా ఆసియాకప్‌లో అర్హత సాధించామన్న ఆనందంలో హాంకాంగ్‌ జట్టు ''కాలా చష్మా'' పాటకు ఆ జట్టు ఆటగాళ్లు అదిరిపోయే స్టెప్పులేశారు. ఇంతకముందు జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన సంతోషంలో ధావన్‌, గిల్‌, ఇషాన్‌ కిషన్‌ సహా టీమిండియా ఆటగాళ్లు చేసిన కాలా చష్మా డ్యాన్స్‌ మూమెంట్స్‌ అభిమానులను ఊపేశాయి. 

కాగా హాంకాంగ్‌ జట్టు ఆసియాకప్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో టేబుల్‌ టాపర్స్‌గా నిలిచి తుది టోర్నీకి అర్హత సాధించింది. కువైట్‌, యూఏఈ, సింగపూర్‌లతో క్వాలిఫై మ్యాచ్‌లు ఆడిన హాంకాంగ్‌ అన్నింటిలోనూ విజయాలు సాధించింది. తద్వారా టీమిండియా, పాకిస్తాన్‌లున్న గ్రూఫ్‌-ఏలో హాంకాంగ్‌ ఆడనుంది. గ్రూఫ్‌-బిగా ఉ‍న్న మరొక దాంట్లో అఫ్గనిస్తాన్‌​, బంగ్లాదేశ్‌, శ్రీలంకలు ఉన్నాయి.  

ఇక ఇవాళ(ఆగస్టు 27న) శ్రీలంక, అఫ్గనిస్తాన్‌ మధ్య మ్యాచ్‌తో ఆసియాకప్‌ 15వ ఎడిషన్‌కు తెరలేవనుంది. క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్ ఆగస్టు 28న(ఆదివారం) జరగనుంది. ఇక ఇప్పటివరకు 15 సార్లు ఆసియా కప్‌ జరగ్గా.. భారత్‌ ఏడుసార్లు, శ్రీలంక ఐదు సార్లు, పాకిస్తాన్‌ రెండుసార్లు నెగ్గాయి.

A post shared by ESPNcricinfo (@espncricinfo)

చదవండి: పాక్‌తో మ్యాచ్‌.. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు రోహిత్‌ డుమ్మా; కేఎల్‌ రాహుల్‌ ఏమన్నాడంటే..

IND Vs PAK Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్‌.. రోహిత్‌తో కలిసి ఓపెనర్‌గా కోహ్లి!

మరిన్ని వార్తలు