T20 WC Prize Money: టీమిండియాకు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే?

12 Nov, 2022 16:34 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో దారుణ పరాజయం చవిచూసి ఇంటిబాట పట్టింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఇంగ్లండ్‌ తుది సమరంలో పాకిస్తాన్‌తో తలపడనుంది. నవంబర్‌ 13న మెల్‌బోర్న్‌ వేదికగా ఇరుజట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. మరి 1992 సీన్‌ను బాబర్‌ ఆజం సేన రిపీట్‌ చేస్తుందా లేక ఇంగ్లండ్‌ దాటికి తోకముడిచి రన్నరప్‌గా నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక సెమీస్‌లో ఇంటిబాట పట్టిన టీమిండియాకు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా.. 400,000 అమెరికన్‌ డాలర్లు. భారత కరెన్సీలో సుమారు 3,26,20,220 రూపాయలు. ఇక తొలి సెమీస్‌లో ఓడిన న్యూజిలాండ్‌కు కూడా ఇదే మొత్త లభించనుంది. ఇక టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడనున్న ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌లలో విజేతగా నిలిచిన జట్టుకు  1,600,000 అమెరికన్‌ డాలర్లు(భారత కరెన్సీలో 13,05,35,440 కోట్ల రూపాయలు) ప్రైజ్‌మనీ ఇవ్వనుంది. రన్నరప్‌గా నిలిచే జట్టు.. 800,000 అమెరికన్‌ డాలర్లు(భారత కరెన్సీలో 6,52,64,280 కోట్ల రూపాయలు) అందుకోనుంది.

►సూపర్‌-12 దశలో నిష్క్రమించిన జట్లు- 560,000 డాలర్లు (8X 70,000 డాలర్లు )
►ఫస్ట్‌రౌండ్లో గెలిచిన జట్లు- 480,000 డాలర్లు (12X 40,000 డాలర్లు)
►ఫస్ట్‌రౌండ్లో ఇంటిబాట పట్టిన జట్లు- 160,000 డాలర్లు(4X 40,000 డాలర్లు)

అయితే టీమిండియాకు వచ్చిన ప్రైజ్‌మనీపై క్రికెట్‌ అభిమానులు వినూత్నంగా స్పందించారు. ''ఐపీఎల్‌లో కోట్లు తీసుకుంటున్న ఆటగాళ్లకు వరల్డ్‌కప్‌ ద్వారా వచ్చే ప్రైజ్‌మనీ పెద్దగా పట్టించుకోరు.. ఐపీఎల్‌ ద్వారా కోట్లు వస్తుంటే దేశానికి ఆడాలని ఏ ఆటగాడికి పెద్దగా అనిపించదు.'' అంటూ పేర్కొన్నారు. 

చదవండి: T20 WC 2022: బాబర్‌ కుడివైపు, బట్లర్‌ ఎడమవైపు..

మరిన్ని వార్తలు