ప్లేఆఫ్స్‌ లక్ష్యంగా సన్‌రైజర్స్‌

3 Nov, 2020 19:04 IST|Sakshi

షార్జా: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో లీగ్‌ దశ నేటితో ముగియనుంది. ఇందుకు ముంబై ఇండియన్స్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ల మధ్య జరుగనున్న మ్యాచ్‌ వేదిక కానుంది. ఇది సన్‌రైజర్స్‌కు చాలా కీలకమైన మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో ఆరెంజ్‌ ఆర్మీ గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ప్రస్తుతం ఆరు విజయాలతో 12 పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్‌..  ముంబైపై గెలిస్తే 14 పాయింట్లతో  ప్లేఆఫ్స్‌ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌(18 పాయింట్లు), ఢిల్లీ క్యాపిటల్స్‌(16 పాయింట్లు), ఆర్సీబీ(14 పాయింట్లు)లు ప్లేఆఫ్స్‌కు చేరగా,  మరో స్థానం కోసం సన్‌రైజర్స్‌-కేకేఆర్‌లు బరిలో నిలిచాయి. (‘కోహ్లి.. నువ్వు ఓపెనర్‌గానే కరెక్ట్‌’)

ఇక్కడ సన్‌రైజర్స్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉండటంతో ముంబై గెలిస్తే బెర్తును దక్కించుకుంటుంది. అదే లక్ష్యంతో సన్‌రైజర్స్‌ బరిలోకి దిగుతోంది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 34 పరుగుల తేడాతో పరాజయం చెందింది. దానికి ప్రతీకారం తీర్చుకుని ప్లేఆఫ్స్‌కు చేరాలని ఆరెంజ్‌ ఆర్మీ సిద్ధమైంది. ఇక ఇరుజట్ల ఓవరాల్‌ ముఖాముఖి పోరులో సన్‌రైజర్స్‌ 7 విజయాలు సాధించగా, ముంబై ఇండియన్స్‌ 8సార్లు గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ముందుగా ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రియాం గార్గ్‌ను జట్టులోకి తీసుకుంది. ఇక ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తిరిగి జట్టులో చేరగా, బుమ్రా, బౌల్ట్‌లకు విశ్రాంతి ఇచ్చారు. వారి స్థానాల్లో ధావన్‌ కులకర్ణి, పాటిన్‌సన్‌లు జట్టులోకి వచ్చారు. జయంత్‌ యాదవ్‌కు సైతం విశ్రాంతి ఇచ్చారు. 

కాగా, సన్‌రైజర్స్‌ ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించింది.  ఇందులో వరుసగా రెండు విజయాలు సాధించడం ఇక్కడ విశేషం. ఇక ముంబై ఇండియన్స్‌ కూడా గత ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు నమోదు చేసింది. ఇక్కడ వరుసగా ముంబై వరుస రెండు విజయాలు సాధించింది. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు ఉండటంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా జరగవచ్చు. సన్‌రైజర్స్‌ జట్టులో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో డేవిడ్‌ వార్నర్‌(444), మనీష్‌ పాండే(380), బెయిర్‌ స్టో(345)లు టాప్‌ ఫెర్ఫార్లగా ఉన్నారు. సన్‌రైజర్స్‌కు వార్నర్‌, పాండేలతో పాటు విలియమ్సన్‌ కీలక ఆటగాడు. దాంతో పాటు ఓపెనింగ్‌ భాగస్వామ్యం ముఖ్యమైనది. ఓపెనర్లు 10 ఓవర్ల వరకూ క్రీజ్‌లో ఉంటే సన్‌రైజర్స్‌ తిరుగుండదు. ఆరెంజ్‌ ఆర్మీ బౌలింగ్‌ విభాగంలో రషీద్‌ ఖాన్‌(18), నటరాజన్‌(14), సందీప్‌ శర్మ(10)లు టాప్‌ ఫెర్ఫార్లగా ఉన్నారు. ముంబై జట్టులో క్వింటాన్‌ డీకాక్‌(418),  ఇషాన్‌ కిషన్‌ (362), సూర్యకుమార్‌(374)లు టాపార్డర్‌లో కీలక ఆటగాళ్లు. వీరిని కట్టడి చేస్తే సన్‌రైజర్స్‌ ఆటోమేటిక్‌గా పైచేయి సాధిస్తుంది. 

ముంబై
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), డీకాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సౌరవ్‌ తివారీ, ఇషాన్‌ కిషన్‌, కృనాల్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌,  కౌల్టర్‌ నైల్‌, రాహుల్‌ చాహర్‌, జేమ్స్‌ పాటిన్‌సన్‌, ధావల్‌ కులకర్ణి

ఎస్‌ఆర్‌హెచ్‌
డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), వృద్ధిమాన్‌ సాహా, మనీష్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌, ప్రియాం గార్గ్‌, జేసన్‌ హోల్డర్‌, అబ‍్దుల్‌ సామద్‌, రషీద్‌ ఖాన్‌, షహబాజ్‌ నదీమ్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌

మరిన్ని వార్తలు