హైదరాబాద్‌ మహిళల వన్డే క్రికెట్‌ జట్టు ఇదే..

23 Oct, 2021 17:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీసీసీఐ సీనియర్‌ మహిళల వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే హైదరాబాద్‌ జట్టును ప్రకటించారు. 27 మంది సభ్యులతో కూడిన హైదరాబాద్‌ జట్టుకు డి. రమ్య కెప్టెన్‌గా వ్యవహరించనుందని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) తెలిపింది. జట్టులో ఐదుగురు స్టాండ్‌బైగా ఉన్నారు. బెంగళూరులో శనివారం నుంచి ఈ టోర్నీ మొదలయింది.

టీమ్‌ ఇదే.. 
డి. రమ్య (కెప్టెన్‌), ప్రణవి చంద్ర (వైస్‌ కెప్టెన్‌), అనూరాధ నాయక్, ఎం.మమత (వికెట్‌ కీపర్లు), కీర్తి రెడ్డి, కె.అనిత, జి.త్రిష, యశశ్రీ, త్రిషా పూజిత, బి.శ్రావణి, బి.అంజలి, తెహ్నియాత్‌ ఫాతిమా, పి.పార్వతి, సాయిలేహ, క్రాంతి రెడ్డి, ప్రణతి రెడ్డి, వంకా పూజ, కోడూరి ఇషిత, ఆలపాటి ప్రణతి, పూజాశ్రీ, ఆశ్రిత రెడ్డి, సి.ఎస్‌.సాధ్వి. స్టాండ్‌బై: ఎం.అనిత, జి.కె.శ్రావ్య, టి.చందన, శివాని గౌడ్, మెర్లిన్‌ జాన్‌. 

విద్యుత్‌ జైసింహ (కోచ్‌), హర్ష హరినారాయణ (అసిస్టెంట్‌ కోచ్‌), స్రవంతి నాయుడు (ఫీల్డింగ్‌ కోచ్‌), గజానంద్‌ రెడ్డి, సునీతా ఆనంద్‌ (ట్రైనర్‌), హర్ష గంగ్వాల్‌ (ఫిజియో), మానస (మేనేజర్‌).

మరిన్ని వార్తలు