అయ్యర్‌ వ్యాఖ్యల వివాదం.. గంగూలీ ఫైర్‌

29 Sep, 2020 18:04 IST|Sakshi
సౌరవ్‌ గంగూలీ(ఫోటో కర్టసీ; పీటీఐ

దుబాయ్‌: బీసీసీఐ అధ్యక్షుడిగా ఉంటూ కూడా ఐపీఎల్‌లో సౌరవ్‌ గంగూలీ వెనకనుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు సహకారం అందిస్తున్నాడా? నిబంధన ప్రకారం ఇది కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ కిందకు రాదా? గత ఆదివారం పంజాబ్‌తో మ్యాచ్‌ అనంతరం క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కారణంగా నిలిచాయి. ‘ఒక కెప్టెన్‌కు ఉత్సాహం, పట్టుదలవంటి లక్షణాలు ఉండాలి. గత కొన్నేళ్లుగా ఇలాంటివి నేను అలవర్చుకున్నాను. అయినా మన చుట్టూ పాంటింగ్‌ (జట్టు హెడ్‌ కోచ్‌), గంగూలీ స్థాయి వ్యక్తులు ఉన్నప్పుడు సహజంగానే మన పని సులువవుతుంది’ అని అయ్యర్‌ వ్యాఖ్యానించాడు. దీనిపై దుమారం రేగింది.(చదవండి: 402 పరుగుల్లో 12 పరుగులే అంటే..)

ఈ వివాదంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మాట్లాడుతూ..‘ నేను అయ్యర్‌కు గత ఏడాది సాయమందించా. నేను బోర్డు అధ్యక్షుడిని కావొచ్చు. కానీ నేను భారత్‌కు సుమారు ఐదు వందల మ్యాచ్‌లు ఆడాననే సంగతి మర్చిపోవద్దు. దాంతో ఒక యువ ఆటగాడికి సాయం చేయడంలో తప్పేముంది. కోహ్లి అయినా, అయ్యర్‌ అయినా సాయమడిగితే నేను చేస్తా. ఎవరికైనా క్రికెట్‌ పరంగా సాయం చేయడానికి వెనుకాడను.దీనికి పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశం ఆపాదించవద్దు’ అని గంగూలీ మండిపడ్డాడు.(చదవండి: ‘సూపర్‌ ఓవర్‌లో ఇషాన్‌ను అందుకే పంపలేదు’)

Poll
Loading...
మరిన్ని వార్తలు