IPL 2022: 'రస్సెల్, ధోనిలా భారీ షాట్లు ఆడలేను.. కానీ పవర్‌ప్లేలో మాత్రం..'

5 May, 2022 11:22 IST|Sakshi
వృద్ధిమాన్ సాహా (PC: IPL/BCCI)

ఐపీఎల్‌-2022లో గుజరాత్‌ టైటాన్స్‌ వికెట్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా నిలకడగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియన్ బ్యాటర్ మాథ్యూ వేడ్ స్థానంలో సాహా గుజరాత్‌ తుది జట్టులోకి వచ్చాడు. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్య చేధనలో సాహా అద్భుతమైన అర్ధసెంచరీ సాధించాడు. ఇక 2008 మొదటి సీజన్‌ నుంచి సహా ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. అయితే తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన సహా పలు విషయాలు పంచుకున్నాడు.

"చిన్నప్పటి నుంచి నేను పొట్టి ఫార్మాట్లో ఆడేందుకు ఇష్టపడతాను.  క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, ధోని భాయ్‌లా భారీ  షాట్లు ఆడలేను. కానీ పవర్‌ప్లేలో జట్టు కోసం త్వరగా పరుగులు సాధించగల సత్తా నాకు ఉంది. వ్యక్తిగత రికార్డుల గురించి నేను ఆలోచించను. ఇప్పటి వరకు జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించాను. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా అత్యత్తుమంగా ఆడటానికి ప్రయత్నిస్తాను" అని సాహా పేర్కొన్నాడు. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన సాహా 154 పరుగులు సాధించాడు.

చదవండిIPL 2022: 'నేను యార్కర్లు వేయలేకపోతున్నాను.. కానీ రాబోయే మ్యాచ్‌ల్లో'

మరిన్ని వార్తలు