ఇంకా పూర్తిగా కోలుకోలేదు: వరుణ్‌ చక్రవర్తి

23 May, 2021 09:32 IST|Sakshi

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి కోవిడ్‌ నుంచి కోలుకున్నప్పటికీ ప్రాక్టీస్‌ చేసే ఫిట్‌నెస్‌ లేదన్నాడు. ఇంకా నీరసం, మగత అలాగే ఉన్నాయని...కోవిడ్‌ తర్వాతి లక్షణాలతో సతమతమవుతున్నానని 29 ఏళ్ల చక్రవర్తి తెలిపాడు. నైట్‌రైడర్స్‌ యజమాని షారుక్‌ఖాన్‌ వ్యక్తిగతంగా మాట్లాడారని, వైరస్‌ నుంచి కోలుకునేందుకు తనలో స్థైర్యం నింపారని వరుణ్‌ చెప్పాడు. ఐపీఎల్‌లో చక్రవర్తి కరోనా బారిన పడ్డాడు. వరుణ్‌కు కరోనా రావడమే ఆ తర్వాత ఐపీఎల్‌ వాయిదాకు కారణమైంది.

మరిన్ని వార్తలు