ENG Vs IND 5th Test: "అతడు అద్భుతమైన ఆటగాడు.. అటువంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు"

30 Jun, 2022 09:04 IST|Sakshi

జూలై1న ప్రారంభం కానున్న నిర్ణయాత్మక ఐదో టెస్టులో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విలేకురులతో మాట్లాడిన టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. భారత స్టా్‌ర్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి చాలా మంది భారత ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చాడని ద్రవిడ్‌ కొనియాడాడు. ఇంత అంకితభావంతో పనిచేసే ఆటగాడిని తాను ఇంతవరకూ చూడలేదని ద్రవిడ్‌ తెలిపాడు. అదే విధంగా ‍కోహ్లి సెంచరీలు సాధించకపోయినా పర్వాలేదు, అతడు జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌ ఆడితే చాలు అని ద్రవిడ్‌ అన్నాడు.

"కోహ్లి ఫామ్‌లో లేడు అని వస్తున్న విమర్శలను నేను  విభేదిస్తున్నాను. ఎందుకంటే కోహ్లి చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. అతడు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆడిన విధానం అద్భుతమైనది. అతడికి ఎటువంటి మోటివేషన్‌ అవసరం లేదు. కోహ్లి సెంచరీలు సాధిస్తానే ఫామ్‌లో ఉన్నట్లు కాదు. అతడు సెంచరీలు సాధించాల్సిన అవసరం లేదు..మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన చేస్తే మాకు చాలు. ఇక డ్రెసింగ్‌ రూమ్‌లో ఎంతో మంది ఆటగాళ్లకు కోహ్లి ఆదర్శంగా నిలిచాడు" అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు.
చదవండి: ENG vs IND: ఇంగ్లండ్‌తో తొలి టీ20.. టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా..!

మరిన్ని వార్తలు