"త్వరలోనే భారత జట్టులోకి వస్తా.. నా విజయంలో అతడిదే కీలక పాత్ర"

20 Feb, 2022 11:42 IST|Sakshi

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ క్రిక్‌ ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయట పెట్టాడు. ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముందు ఉమ్రాన్‌ మాలిక్‌ను రూ.4 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ రీటైన్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. గంటకు 150 కి.మీ స్పీడ్‌, బ్యాటర్లను హడలెత్తించే యార్కర్లు మాలిక్‌ సొంతం. ప్రస్తుతం ఉమ్రాన్‌ రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్‌ జట్టు తరుపున ఆడుతున్నాడు.

రంజీ ట్రోఫీలో అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక ఐపీఎల్‌-2021 సెకెండ్‌ ఫేజ్‌లో నటరాజన్‌ స్ధానంలో జట్టులోకి వచ్చిన ఉమ్రాన్‌ తన బౌలింగ్‌తో అందరినీ అకట్టుకున్నాడు. గత ఏడాది సీజన్‌లో ఆర్సీబీపై 152.95 స్పీడ్‌తో బౌలింగ్‌ వేసిన ఉమ్రాన్‌.. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంతమైన డెలివరీ వేసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

ప్రశ్న:   మీ పేస్‌ బౌలింగ్‌ అభివృద్ధిపై ఇర్ఫాన్ పఠాన్ ప్రభావం ఎంతవరకు చూపింది?

సమాధానంఇర్ఫాన్ భాయ్ జమ్మూ కాశ్మీర్‌ మెంటర్‌ కమ్‌ కోచ్‌గా తన జర్నీను ప్రారంభించినప్పడు.. అతను నేను నెట్స్‌లో బౌలింగ్ చేయడం చూసేవాడు. అప్పుడు నా స్కిల్స్‌ను మరింత మెరుగుపరచుకోవడానికి నాకు చాలా సహాయం చేశాడు. నేను అతనికి నా బౌలింగ్‌ వీడియోలను పంపేవాడిని. భాయ్‌  వీడియోలు చూసి నేను చేస్తున్నది సరైనది లేదా తప్పు అనే దానిపై తన అభిప్రాయాన్ని తెలియజేసేవాడు. కాబట్టి, నా కెరీర్‌ అభివృద్దిలో అతని పాత్ర చాలా పెద్దది.

ప్రశ్న:  దక్షిణాఫ్రికా టూర్‌లో ఇండియా-ఎ జట్టుకు ఆడిన అనుభవం ఎలా ఉంది?

 సమాధానంఅది నా మొదటి విదేశీ పర్యటన. ప్రోటిస్‌ గడ్డపై ఆడడం ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.

ప్రశ్న:  మీరు గత సీజన్‌లో ఐపీఎల్‌లో సన్‌రైజర్స​ తరుపున  అరంగేట్రం చేయడం ఎలా ఫీల్‌ అవుతున్నారు? 

సమాధానంజమ్మూ కాశ్మీర్‌ జట్టు తరుపున ఆడటానికి గత రెండేళ్లుగా నేను చాలా కష్టపడ్డాను. అటు వంటి సమయంలో ఐపీఎల్‌ వంటి మెగా టోర్నీలో ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఫీల్‌ అయ్యాను. భగవంతుని దయతో మరింత రాణించడానికి ప్రయత్నిస్తాను. అదే విధంగా వీలైనంత త్వరగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నాను.

ప్రశ్న:  ఐపీఎల్‌-2022 కోసం స్టార్‌ ఆటగాళ్లను కాకుండా మిమ్మల్ని ఎస్‌ఆర్‌హెచ్‌ రీటైన్‌ చేసుకుంది, అది మీకు ఎలా అనిపించింది?

సమాధానం: చాలా మంది స్టార్‌ ఆటగాళ్లను కాకుండా ఎస్‌ఆర్‌హెచ్‌ నన్ను  రీటైన్‌ చేసికున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నా తొలి ఐపీఎల్ సీజన్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు ఆడినప్పటికీ, నన్ను రీటైన్‌ చుసుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ విషయంలో నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
 

మరిన్ని వార్తలు