PSL 2023: ఉమ్రాన్‌ మాలిక్‌ ఫాస్టెస్ట్ బాల్ రికార్డ్ బ్రేక్ చేస్తా? నీకు అంత సీన్‌ లేదులే.. ?

6 Feb, 2023 12:17 IST|Sakshi

Umran Malik Fastest Ball Record: ఉమ్రాన్‌ మాలిక్‌.. ప్రస్తుత భారత బౌలింగ్‌ విభాగంలో యవ సంచలనం. ఐపీఎలో అదరగొట్టి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఉమ్రాన్‌.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన పేస్‌ బౌలింగ్‌తో పత్యర్ది బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇటీవలే శ్రీలంక‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో 156 కిమీ వేగంతో బాల్‌ను  ఉమ్రాన్ మాలిక్‌ సంధించాడు.

దీంతో వన్డేల్లో భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అదే విధంగా లంకతో జరిగిన టీ20 సిరీస్‌లో 155 కిమీ వేగంతో బంతిని వేసిన ఉమ్రాన్‌..  టీ20ల్లో కూడా అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

ఉమ్రాన్‌ మాలిక్‌ రికార్డు బ్రేక్‌ చేస్తా..
అయితే ఉమ్రాన్‌ మాలిక్‌ ఫాస్టెస్ట్ బాల్ రికార్డ్ బ్రేక్ చేస్తా అంటూ పాకిస్తాన్‌ పేసర్‌ జమాన్‌ ఖాన్‌ ఛాలెంజ్‌ విసిరాడు. త్వరలో జరగనున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఉమ్రాన్‌ రికార్డు బ్రేక్‌ చేస్తానని జమాన్‌ ఖాన్‌ ప్రగల్భాలు పలికాడు. ఈ ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అల్లా దయతో ఉమ్రాన్ మాలిక్ వేగవంతమైన బంతి రికార్డును నేను బద్దలు కొడతాను అని ఓ స్పోర్ట్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.  

కాగా పీఎస్‌ఎల్‌లో లాహోర్ క్వాలండర్స్‌కు జమాన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక దేశీవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న జమాన్‌ ఖాన్‌.. పాకిస్తాన్‌ జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేసేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాడు.

                                         

నీకు అంత సీన్‌ లేదులే..
ఇక​ జమాన్‌ ఖాన్‌ చేసిన వాఖ్యలపై భారత అభిమానులు మండిపడుతున్నారు. "నీకు అంత సీన్‌ లేదులే.. ముందు జట్టులో చోటు సంపాందించుకో" అంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక ఈ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023 ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IND vs AUS: భారత్‌ టెస్టు సిరీస్‌ గెలవడం కష్టమే.. శ్రీలంక దిగ్గజం సంచలన వ్యాఖ్యలు!

మరిన్ని వార్తలు