Shoaib Akhtar: పాంటింగ్‌ కాకుండా వేరే వాళ్లైయ్యుంటే తల బద్దలయ్యేదే..!

19 Mar, 2022 18:57 IST|Sakshi

పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. దిగ్గజ ఆసీస్‌ ప్లేయర్‌ రికీ పాంటింగ్‌ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 1999లో పెర్త్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. నాటి ఆసీస్‌ పర్యటనలో పాక్‌ అప్పటికే 0–2తో వెనుకబడి ఉందని, మూడో టెస్ట్‌లో ఎలాగైనా గెలవాలనే కసితో ప్రత్యర్ధులపై బౌన్సర్లతో విరుచుకుపడాలని డిసైడయ్యానని పేర్కొన్నాడు. ప్లాన్‌లో భాగంగా పాంటింగ్‌ను టార్గెట్‌ చేశానని, అయితే ఆ సమయంలో పాంటింగ్ కాకుండా ఏ ఇతర ఆటగాడు క్రీజ్‌లో ఉన్నా బంతితో తల పగులగొట్టేవాడినేనని ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. 

ఇదే సందర్భంగా అక్తర్‌ మాట్లాడుతూ.. 2005 ఆసీస్‌ పర్యటనలో జస్టిన్ లాంగర్‌తో గొడవ జరిగిందని, అలాగే మాథ్యూ హేడెన్‌తో చిన్నపాటి ఘర్షణ కొట్టుకునేంతవరకు వెళ్లిందని గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లలాగే తాను కూడా దూకుడుగా ఉండే వాడినని.. ఆ యాటిట్యూడ్‌ ఆసీస్‌ ఆటగాళ్లకు కూడా బాగా నచ్చేదని చెప్పుకొచ్చాడు. అప్పట్లోలా ప్రస్తుత ఆస్ట్రేలియా ఆటగాళ్లలో దూకుడు లేదని, అంతా సున్నితంగా ఉన్నారని, నేటి తరం ఆసీస్‌ ఆటగాళ్లలో ఆ వైఖరి ఎందుకు కొరవడిందో అర్ధం కావడం లేదని అన్నాడు. బ్రిస్బేన్‌లోని జెఫ్ థామ్సన్ ఇల్లు తనకు రెండో ఇల్లు లాంటిదని ఈ సందర్భంగా ప్రస్తావించాడు.
చదవండి: వరల్డ్‌కప్‌కు ముందే భారత్‌- పాక్‌ మ్యాచ్‌.. ఎప్పుడంటే..?

మరిన్ని వార్తలు