ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్సీ రేసులో నేను లేను: మార్ష్‌

11 Oct, 2022 12:32 IST|Sakshi

ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ వన్డేలకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.  ఇంకా ఇప్పటి వరకు ఫించ్‌ స్థానంలో ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్‌గా క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎవరిని నియమించలేదు. ఈ క్రమంలో ఫించ్‌ వారుసుడిగా ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిచిల్‌ మార్ష్‌ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడని వార్తలు వినిపించాయి.

ఈ వార్తలపై మార్ష్‌ తాజాగా స్పందించాడు. కెప్టెన్సీపై తనకు ఆసక్తి లేదని, తన వ్యక్తిగత ఆటను మెరుగుపరచుకోవడంపై దృష్టి సారిస్తానని మార్ష్ స్పష్టం చేశాడు. ఈఎస్పీన్‌ క్రిక్‌ఇన్‌ఫోతో మార్ష్‌ మాట్లాడుతూ.. "నిజంగా వన్డే కెప్టెన్సీ రేసులో నేను లేను. ప్రస్తుతం నా దృష్టి అంతా టీ20 ప్రపంచకప్‌పైనే. మరో సారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడానికి మాకు ఇది మంచి అవకాశం.

ఇటువంటి సమయంలో కెప్టెన్సీ గురించి అస్సలు నేను ఆలోచించను. ఈ మెగా ఈవెంట్‌లో నా ఆటతీరును మరింత మెరుగుపరుచుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. అయితే టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత వన్డే కెప్టెన్సీ గరుంచి క్రికెట్ ఆస్ట్రేలియా ఓ నిర్ణయం తీసుకుంటుంది" అని పేర్కొన్నాడు. కాగా మార్ష్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో ఆసీస్‌ జట్టులో భాగంగా ఉన్నాడు.
చదవండి: IND vs SA: ఢిల్లీలో భారీ వర్షాలు.. మూడో వన్డే జరిగేనా?

మరిన్ని వార్తలు