త్వరలో ఆటకు బెల్‌ బైబై

7 Sep, 2020 09:43 IST|Sakshi

లండన్‌: ఇప్పటికే అంతర్జాతీయ వన్డేలకు గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ బెల్‌.. ఈ ఏడాదితో దేశవాళి క్రికెట్‌తో పాటు టెస్టు క్రికెట్‌కు కూడా వీడ్కోలు  పలకనున్నట్లు ప్రకటించాడు.   2004లో ఇంగ్లండ్‌ వన్డే, టెస్టు జట్లలో అరంగేట్రం చేసిన అతడు... 161 వన్డేల్లో 5416 పరుగులు, 118 టెస్టుల్లో 7727 పరుగులు సాధించాడు. టెస్టు కెరీర్‌ కోసం 2015లోనే వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన 38 ఏళ్ల బెల్‌... గాయాలతో టెస్టు జట్టులోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేదు. (చదవండి: రైనాకు ఏదైనా జరగకూడనిది జరిగితే..!)

చివరిసారిగా ఇంగ్లండ్‌ తరఫున 2015లో టెస్టు మ్యాచ్‌ ఆడిన అతడు... మళ్లీ జట్టులోకి రాలేదు. అప్పటి నుంచి దేశవాళి క్రికెట్‌ జట్టు వార్విక్‌షైర్‌తో ఉన్నాడు. ‘క్రికెట్‌పై నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు. అయితే నాకిష్టమైన ఆటను ఆడేందుకు నా శరీరం సహకరించడం లేదు. దాంతో ఈ ఏడాదితో క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నా’ అని బెల్‌ పేర్కొన్నాడు. ఇయాన్‌ బెల్‌ తన కెరీర్‌లో ఇంగ్లండ్‌ తరఫున 8 టి20లు ఆడాడు. (చదవండి: శానిటైజర్‌ను ఇలా కూడా వాడొచ్చా!)

>
మరిన్ని వార్తలు