పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 60 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్ సంచలన విజయం సాధించింది. 294 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 234 పరుగులకే ఆలౌటైంది. ఆఫ్గాన్ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ నాలుగు వికెట్లతో శ్రీలంకను దెబ్బతీయగా.. నైబ్ మూడు, యమీన్ రెండు, రషీద్ ఒక్క వికెట్ సాధించారు.
శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్ నిస్సాంక(85) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో హసరంగా(66) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది.
ఆఫ్గానిస్తన్ బ్యాటర్లలో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(106) సెంచరీతో చెలరేగాడు. అతడితో పాట గుర్బాజ్(53), రెహమత్(52) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో హసరంగా రెండు వికెట్లు సాధించగా..రజితా, కుమారా, లక్షణ్, తీక్షణ తలా వికెట్ పడగొట్టారు.
చదవండి: ధావన్‌కు అన్యాయం జరుగుతూనే ఉంది: రవిశాస్త్రి