ICC Special Award: ఫీల్డర్లను పరుగులు పెట్టించిన కుక్క.. ఐసీసీ ప్రత్యేక అవార్డు

14 Sep, 2021 10:07 IST|Sakshi

దుబాయ్‌: ఐసీసీ తాజాగా ప్రకటించిన ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుల జాబితాలో ఒక బుజ్జి కుక్క చోటు సంపాదించింది. ఐసీసీ డాగ్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు గెలుచుకున్న ఆ బుజ్జి కుక్క ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ అవార్డుపై ఐసీసీ ట్విటర్‌లో స్పందింస్తూ.. ''ఈసారి ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుల్లో ఒక కొత్త అతిథి వచ్చి చేరింది. బంతిని నోట కరచుకొని మైదానంలో ఫీల్డర్లను పరుగులు పెట్టించిన కుక్క అది.. అందుకే దాన్ని అథ్లెట్‌ డాగ్‌ పరిగణిస్తూ.. ''ఐసీసీ డాగ్‌ ఆఫ్‌ ది మంత్‌'' అవార్డును బహుకరించాం'' అంటూ పోస్ట్‌ చేసింది.

చదవండి:  రనౌట్‌ అవకాశం; ఊహించని ట్విస్ట్‌.. ఫీల్డర్ల పరుగులు


గతవారం ఐర్లాండ్‌ క్లబ్‌ క్రికెట్‌లో భాగంగా మైదానంలో బుజ్జి కుక్క ఫీల్డర్లను పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. బ్రీడీ, సీఎస్‌ఎన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో అబ్బీ లెక్కీ స్కేర్‌లెగ్‌ దిశగా షాట్‌ ఆడింది. ఫీల్డర్‌ బంతిని అందుకొని నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు విసిరింది. అదే సమయంలో ఒక బుజ్జి కుక్క తన యజమాని నుంచి తప్పించుకొని మైదానంలోకి పరుగులు తీసింది. బంతిని అందుకున్న బౌలర్‌ వికెట్లను గిరాటేసే ప్రయత్నం చేయగా.. మిస్‌ అయింది. అలా రనౌట్‌ అవకాశం కూడా పోయింది. ఇక బంతిని బుజ్జి కుక్క తన నోట కరుచుకొని గ్రౌండ్‌లో పరుగులు పెట్టింది. అలా ఫీల్డర్లు కూడా ఆ కుక్క వెంబడి పరుగులు తీశారు. ఈ వీడియో ట్రెండింగ్‌గా మారింది.

చదవండి: జో రూట్‌ ఘనత.. ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ మంత్‌గా

మరిన్ని వార్తలు