వరల్డ్‌కప్‌ కామెంటేటర్ల జాబితా విడుదల.. వివాదాస్పద వ్యాఖ్యాతకు దక్కని చోటు

16 Oct, 2022 15:08 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో కామెంట్రీ చెప్పబోయే వ్యక్తుల జాబితాను ఐసీసీ ఇవాళ ప్రకటించింది. ఈ జాబితాలో వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌కు చోటు దక్కకపోగా.. భారత్‌ నుంచి ముగ్గురికి అవకాశం లభించింది. మొత్తంగా ఈ జాబితాలో వివిధ దేశాలకు చెందిన 29 మందికి చోటు లభించింది. ఐసీసీ వరల్డ్‌కప్‌-2022 కామెంటేటర్ల ప్యానెల్‌లో ఈ సారి ఏకంగా ముగ్గురు మహిళా వ్యాఖ్యాతలకు చోటు దక్కడం విశేషం.

ఇంగ్లండ్‌కు చెందిన ఇషా గుహ, మెల్‌ జోన్స్‌, నథాలీ జెర్మానోస్‌ వరల్డ్‌కప్‌లో మహిళా వాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. వరల్డ్‌కప్‌ వ్యాఖ్యాతల ప్యానెల్‌లో భారత్‌కు చెందిన రవిశాస్త్రి, హర్షా భోగ్లే, న్యూజిలాండ్‌కు చెందిన డానీ మారిసన్‌, సైమన్‌ డౌల్‌, వెస్టిండీస్‌కు చెందిన ఇయాన్‌ బిషప్‌, ఇంగ్లండ్‌కు చెందిన నాసిర్‌ హుసేన్‌ వ్యాఖ్యానం సెంటర్‌ ఆఫ్‌ ది అట్రాక్షన్‌గా నిలువనుంది. 

వరల్డ్‌కప్‌-2022 కోసం ఎంపిక చేసిన కామెంటేటర్ల వివరాలు.. 
ఆడమ్ గిల్‌‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా), అథర్ అలీ ఖాన్ (బంగ్లాదేశ్‌), బాజిద్ ఖాన్ (పాకిస్తాన్‌), బ్రియాన్‌ ముర్గత్రయోడ్ (నమీబియా), కార్లోస్ బ్రాత్‌వైట్ (వెస్టిండీస్‌), డేల్ స్టెయిన్ (సౌతాఫ్రికా), డానీ మారిసన్ (న్యూజిలాండ్‌), డిర్క్ నానెస్‌ (ఆస్ట్రేలియా), ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్‌), హర్షా భోగ్లే (ఇండియా), ఇయాన్ బిషష్ (వెస్టిండీస్‌), ఇయాన్ స్మిత్ (న్యూజిలాండ్‌), ఇషా గుహా (ఇంగ్లండ్‌), మార్క్ హోవర్డ్ (ఆస్ట్రేలియా), మెల్ జోన్స్ (ఆస్ట్రేలియా), మైఖేల్ అథర్టన్ (ఇంగ్లండ్‌), మైకేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా), నాసిర్ హుస్సేన్ (ఇంగ్లండ్‌), నథాలీ జెర్మానోస్ (గ్రీస్‌), నీల్ ఓబ్రెయిన్ (ఇంగ్లండ్‌), పోమి ఎంబాంగ్వా (జింబాబ్వే),  ప్రెస్టన్ మోమ్సేన్ (స్కాట్లాండ్‌), రవిశాస్త్రి (ఇండియా), రసెల్ ఆర్నాల్డ్ (శ్రీలంక), సామ్యూల్ బద్రి (వెస్టిండీస్‌), షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా), షాన్ పొలాక్ (సౌతాఫ్రికా), సైమన్ డౌల్ (న్యూజిలాండ్‌), సునీల్ గవాస్కర్ (ఇండియా)  

మరిన్ని వార్తలు