లీగ్‌ ఆరంభమే కాలేదు.. అప్పుడే ఫిక్సింగ్‌ కలకలం

26 Nov, 2020 13:46 IST|Sakshi

కొలంబో:  ఎన్నో వాయిదాల తర్వాత ఈరోజు(నవంబర్‌ 26వ తేదీ)  ఆరంభం కానున్న లంక  ప్రీమియర్‌ లీగ్‌(ఎల్‌పీఎల్‌) ఆరంభం సీజన్‌కు అప్పుడే ఫిక్సింగ్‌ తాకిడి తగిలింది. మ్యాచ్‌లను తమకు అనుకూలంగా ఫిక్స్‌  చేయాలని జాతీయ జట్టుకుకు చెందిన మాజీ క్రికెటర్‌ ఎల్‌పీఎల్‌ ఆడే ఒక ప్లేయర్‌ను  కలిసిన విషయం తాజాగా వెలుగుచూసింది. ఈ మేరకు  ఫిర్యాదు అందుకున్న ఐసీసీ, శ్రీలంక క్రికెట్‌ బోర్డులు దీనిపై  సీరియస్‌ దృష్టి సారించాయి. భారీ ఫిక్సింగ్‌కు తెరలేపడానికి చూస్తున్నట్లు స్థానిక పత్రిక లంకా దీప తన కథనంలో పేర్కొంది. దాంతో ఐసీసీతో పాటు ఎస్‌ఎల్‌సీలు అలెర్ట్‌ అయ్యాయి. దీనిపై అప్పుడే ఐసీసీ విచారణకు రంగం సిద్ధం చేయగా, ఈ అంశంపై మాట్లాడటానికి మాత్రం నిరాకరించింది. ఎల్‌పీఎల్‌లో ఆడే విదేశీ ఆటగాడినే లక్ష్యంగా చేసుకుని ఫిక్సింగ్‌కు తెరలేపడానికి యత్నించినట్లు తెలుస్తోంది. (కోహ్లిని ఊరిస్తున్న తొలి క్రికెటర్‌ రికార్డు)

కరోనా వైరస్‌ కారణంగా పలుమార్లు వాయిదా పడ్డ లంక ప్రీమియర్‌ లీగ్‌(ఎల్‌పీఎల్‌) ఎట్టకేలకు ఆరంభం కానుంది. ఈ లీగ్‌ ఆలస్యం కావడంతో క్రిస్‌ గేల్‌, డుప్లెసిస్‌ వంటి ఆటగాళ్లు అక్కడ ఆడేందుకు అవకాశం లభించింది. ప‍్రస్తుతం ఐపీఎల్‌ ఆడుతున్న వీరిద్దరూ యూఏఈ నుంచి నేరుగా ఎల్‌పీఎల్‌ ఆడేందుకు వెళ్లనున్నారు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఈ ట్వంటీ 20 శ్రీలంక టోర్నమెంట్‌ ఆగస్టులో ఆరంభం కావాల్సి ఉంది. కాగా, తొలుతనవంబర్‌ 14కు వాయిదా పడింది. మళ్లీ నవంబర్‌ 26వ తేదీకి వాయిదా వేస్తూ లంక బోర్డు నిర్ణయం తీసుకుంది. లంక ప్రీమియర్‌ లీగ్‌లో ఆడటానికి కండీ టస్కర్స్‌తో ఇర్ఫాన్‌ ఒప్పందం చేసుకున్నాడు. ఈ లీగ్‌ ఆలస్యం కావడంతో క్రిస్‌ గేల్‌, డుప్లెసిస్‌ వంటి ఆటగాళ్లు అక్కడ ఆడేందుకు అవకాశం లభించింది. ఇందులో ఐదు ఎల్‌పీఎల్‌ జట్లు ఉండగా ప్రతీ ఫ్రాంచైజీ ఆరుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకునే వీలుంది. ఇది ఎల్‌పీఎల్‌ ఆరంభపు సీజన్‌ కావడం గమనార్హం. డిసెంబర్‌ 16వ తేదీ వరకూ జరుగనుంది. అభిమానులు స్టేడియాల్లోకి అనుమతి లేకుండా క్లోజ్డ్‌ డోర్స్‌లో  ఈ లీగ్‌ను  నిర్వహిస్తున్నారు. క్యాండీ టస్కర్స్‌- కొలంబో కింగ్స్‌  మధ్య రాత్రి గం.7.30ని.లకు ఆరంభపు   మ్యాచ్‌ జరుగనుంది. (షమీ భార్య జహాన్‌కు వేధింపులు)

మరిన్ని వార్తలు