ICC: అంపైరింగ్‌ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం

24 May, 2022 13:02 IST|Sakshi

ఇటీవలీ కాలంలో క్రికెట్‌ మ్యాచ్‌లో ఫీల్డ్‌ అంపైర్లు పక్షపాత ధోరణి అవలంభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సొంత దేశంలో సిరీస్‌ ఆడుతున్న జట్టుకు అక్కడి లోకల్‌ అంపైర్స్‌ మద్దతుగా నిలుస్తూ ప్రత్యర్థి జట్లు సిరీస్‌లు కోల్పోయేలా చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. వీటిలో నిజమెంత అనేది పక్కనబెడితే.. తాజాగా ఐసీసీ అంపైరింగ్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకముందు ఉన్న న్యూట్రల్‌ అంపైర్‌(తటస్థ అంపైర్‌​) విధానాన్ని ఐసీసీ తిరిగి తీసుకురానుంది. దీనివల్ల పక్షపాత ధోరణి అనే పదానికి చెక్‌ పెట్టినట్లు అవుతుందని ఐసీసీ చైర్మెన్‌ గ్రేగ్‌ బార్క్‌లే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

వాస్తవానికి కరోనా ముందు న్యూట్రల్‌ అంపైరింగ్‌ వ్యవస్థ అమల్లో ఉండేది. న్యూట్రల్‌ అంపైరింగ్‌ అంటే ఒక దేశం మరొక దేశంలో సిరీస్‌ ఆడేందుకు వెళ్లినప్పుడు లోకల్‌ అంపైర్లతో పాటు బయటి దేశాలకు చెందిన అంపైర్లు ఫీల్డ్‌ అంపైర్స్‌గా వ్యవహరించేశారు. అయితే 2020లో కరోనా మహమ్మారి విజృంభించడంతో బయటి దేశాల అంపైర్లపై ట్రావెల్‌పై బ్యాన్‌ విధించడంతో న్యూట్రల్‌ అంపైరింగ్‌ వ్యవస్థకు బ్రేక్‌ పడింది. అప్పటినుంచి ఏ దేశంలో సిరీస్‌లు జరిగినా ఆ దేశానికి చెందిన వ్యక్తులు ఫీల్డ్‌ అంపైర్లుగా వ్యవహరిస్తున్నారు. 

ఈ విషయం పక్కనబెడితే.. ఇటీవలే బంగ్లాదేశ్‌ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించింది.ఈ టూర్‌లో సౌతాఫ్రికాకు చెందిన అంపైర్లు మరియస్‌ ఎరాస్మస్‌, ఆడ్రియన్‌ హోల్డ్‌స్టాక్‌లు తమ తప్పుడు నిర్ణయాలతో పక్షపాత ధోరణి చూపించారంటూ విమర్శలు వచ్చాయి. చాలా మంది బంగ్లా ఆటగాళ్ల ఔట్‌ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని.. దీనివల్ల జట్టు ఓటమిపై ప్రభావం చూపిందంటూ ఆరోపణలు వచ్చాయి. ఇక​ బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ సౌతాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. అయితే న్యూట్రల్‌ అంపైరింగ్‌ లేకపోవడం వల్ల.. లోకల్‌ అంపైర్స్‌ నిర్ణయాలు తమ కొంప ముంచాయంటూ షకీబ్‌ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేయడం వైరల్‌గా మారింది.

షకీబ్‌ కామెంట్స్‌ తర్వాత బంగ్లా క్రికెట్‌ బోర్డు(బీసీబీ) లోకల్‌ అంపైరింగ్‌ పక్షపాత ధోరణిపై ఐసీసీ మ్యాచ్‌ రిఫరీకి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ తమ స్వదేశంలో లంకతో ఆడుతున్న సిరీస్‌లో న్యూట్రల్‌ అంపైర్‌ను ఐసీసీ తాత్కాలికంగా ప్రవేశపెట్టింది. స్థానిక అంపైర్ షర్ఫుద్దౌలాతో పాటు ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరో, వెస్టిండీస్‌కు చెందిన జోయెల్ విల్సన్‌లను అంపైర్లుగా నియమించడంతో వివాదం సద్దుమణిగింది. ఇక తొందరలోనే న్యూట్రల్‌ అంపైరింగ్‌ను పూర్తి స్థాయిలో తిరిగి తీసుకురానున్నట్లు ఐసీసీ ప్రకటించింది. 

చదవండి: IND Vs SA T20 Series: ధావన్‌ ఎంపికలో అన్యాయం.. కేఎల్‌ రాహుల్‌ జోక్యంలో నిజమెంత?

Kusal Mendis: మ్యాచ్‌ జరుగుతుండగానే ఛాతి నొప్పి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

>
Poll
Loading...
మరిన్ని వార్తలు