ఐసీసీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో వినూ మన్కడ్, సంగక్కర

14 Jun, 2021 09:26 IST|Sakshi
వినూ మన్కడ్‌- కుమార సంగక్కర

దుబాయ్‌: తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ను పురస్కరించుకొని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) పది మంది దిగ్గజ క్రికెటర్లకు ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చోటు కల్పించింది. ఇందులో భారత్‌ నుంచి దివంగత క్రికెటర్‌ వినూ మన్కడ్‌కు... శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కరకుమార సంగక్కరకు స్థానం దక్కింది. 1978లో మృతి చెందిన వినూ మన్కడ్‌ భారత్‌ తరఫున 1947 నుంచి 1959 మధ్య కాలంలో 44 టెస్టులు ఆడి 2,109 పరుగులు చేయడంతోపాటు 162 వికెట్లు తీశారు.

మేటి ఆల్‌రౌండర్‌గా పేరున్న వినూ మన్కడ్‌ 1952లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 72, రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులు చేయడంతోపాటు బౌలింగ్‌లో ఏకంగా 97 ఓవర్లు వేశారు. దిగ్గజ క్రికెటర్‌ సంగక్కర శ్రీలంక తరఫున 134 టెస్టులు (12,400 పరుగులు), 404 వన్డేలు (14,234 పరుగులు), 56 టి20 మ్యాచ్‌లు (1,382 పరు గులు) ఆడాడు. వినూ మన్కడ్, సంగక్కరలతోపాటు మోంటీ నోబుల్‌ (ఆస్ట్రేలియా), కాన్‌స్టన్‌ టైన్‌ (వెస్టిండీస్‌), స్టాన్‌ మెక్‌కేబ్‌ (ఆస్ట్రేలియా), డెక్స్‌టర్‌ (ఇంగ్లండ్‌), హేన్స్‌ (వెస్టిండీస్‌), బాబ్‌ విల్లీస్‌ (ఇంగ్లండ్‌), ఆండీ ఫ్లవర్‌ (జింబాబ్వే) కూడా ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో స్థానం పొందారు. 

చదవండి: సిరీస్‌తోపాటు ‘టాప్‌’ ర్యాంక్‌ సొంతం

మరిన్ని వార్తలు