ఐసీసీ కీలక ప్రకటన.. ఇకపై ప్రతినెలా

27 Jan, 2021 13:10 IST|Sakshi

దుబాయ్‌: అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్ల విజయాన్ని సెలబ్రేట్‌ చేసేందుకు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) సరికొత్త పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ప్రతి నెలా 'ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌' అవార్డు ఇవ్వనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఐసీసీ ఓటింగ్‌ అకాడమీతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానుల ఓట్లను పరిగణనలోకి తీసుకుని విజేతను నిర్ణయించనున్నట్లు పేర్కొంది. ఓట్ల ఆధారంగా పురుష, మహిళా క్రికెటర్లకు అవార్డు ఇవ్వనున్నట్లు పేర్కొంది. (చదవండి: ఆసీస్‌ టూర్‌: అరంగేట్రంలోనే అదరగొట్టేశారు!)

కాగా ఈ సరికొత్త అవార్డు కేటగిరీలో జనవరి నెలకుగానూ భారత్‌ నుంచి నలుగురు క్రికెటర్ల పేర్లు ఐసీసీ పరిశీలనలో ఉన్నాయి. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్న యువ ఆటగాళ్లు..  రిషభ్‌ పంత్‌, మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, టి.నటరాజన్‌తో పాటు రవిచంద్ర అశ్విన్‌ పేర్లను పరిశీలిస్తోంది. వీరితో పాటు జోరూట్‌(ఇంగ్లండ్‌), స్టీవ్‌ స్మిత్‌(ఆస్ట్రేలియా), మరిజన్నే కాప్‌(దక్షిణాఫ్రికా) పేర్లు కూడా ఐసీసీ పరిశీలనలో ఉన్నాయి.(చదవండి: కెరీర్‌ అత్యుత్తమ స్థానంలో రిషభ్‌ పంత్‌) 

చెన్నైకి చేరుకున్న ఇంగ్లండ్‌ జట్టు
న్యూఢిల్లీ: నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ జట్టు చెన్నై చేరుకుంది. కరోనా నేపథ్యంలో నేటి నుంచి 6 రోజులపాటు క్రికెటర్లు క్వారంటైన్‌లో ఉండనున్నారు. కాగా ఫిబ్రవరి 5 నుంచి భారత్‌-ఇంగ్లండ్‌ తొలిటెస్టు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలో ప్రేక్షకులు లేకుండానే టెస్టు మ్యాచ్‌ నిర్వహించనున్నారు. (చదవండి: ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌: పూర్తి షెడ్యూల్‌ ఇదే!)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు