ఇకపై క్రికెట్‌లో కొత్త రూల్‌.. అతిక్రమిస్తే తప్పదు భారీ మూల్యం

22 Nov, 2023 09:05 IST|Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి పురుషుల వన్డే, టీ20 క్రికెట్‌లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. "స్టాప్‌ క్లాక్‌" పేరుతో ఉండే ఈ నిబంధనను వచ్చే ఏడాది (2024) ఏప్రిల్‌ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఐసీసీ వెల్లడించింది. 

స్టాప్‌ క్లాక్‌ నిబంధన ఏంటంటే..
ఐసీసీ కొత్తగా ఓవర్‌కు ఓవర్‌కు మధ్య 60 సెకెన్ల నిర్దిష్ట సమయాన్ని గ్యాప్‌ టైమ్‌గా ఫిక్స్‌ చేసింది. బౌలింగ్‌ జట్టు ఈ సమయంలోపే మరుసటి ఓవర్‌ వేసేందుకు బౌలర్‌ను దించాలి. రెండుసార్లు నిర్దిష్ట వ్యవధి దాటితే మన్నిస్తారు. మూడోసారి ఆలస్యమైతే మాత్రం బౌలింగ్‌ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీగా విధిస్తారు.

ఈ పరుగులు బ్యాటింగ్‌ టీమ్‌ స్కోర్‌కు యాడ్‌ అవుతాయి. ఫీల్డ్‌ అంపైర్లు స్టాప్‌ క్లాక్‌తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు. అహ్మదాబాద్‌లో నిన్న (నవంబర్‌ 21)  జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో స్టాప్‌ క్లాక్‌ నిబంధన అమలుపై నిర్ణయం తీసుకున్నారు. 


 

మరిన్ని వార్తలు