యూఏఈలోనే టి20 ప్రపంచకప్‌: గంగూలీ

29 Jun, 2021 05:54 IST|Sakshi

కరోనా నేపథ్యంలో టి20 ప్రపంచకప్‌ వేదిక మారింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో భారత్‌లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్‌ను యూఏఈకి తరలిస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.  ‘ప్రపంచకప్‌ వేదికను యూఏఈకి మారుస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)కి సమాచారం ఇచ్చాం. తుది షెడ్యూల్, ఇతరత్రా విషయాలన్నీ త్వరలోనే వెల్లడిస్తాం’ అని గంగూలీ చెప్పారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు