టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2022కు సంబంధించి కీల‌క ప్రకటన

14 Jan, 2022 19:54 IST|Sakshi

దుబాయ్‌: ఆస్ట్రేలియా వేదిక‌గా ఈ ఏడాది చివ‌ర్లో జరగనున్న పురుషుల టీ20 వ‌రల్డ్‌క‌ప్‌కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈ నెల(జనవరి) 21న వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ను వెల్లడించనున్నట్లు ఐసీసీ పేర్కొంది. టిక్కెట్ల అమ్మకం ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. 


మొత్తం 12 జ‌ట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ అక్టోబ‌ర్ 13-న‌వంబ‌ర్ 16 మ‌ధ్యలో జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతేడాది టీ20 ప్రపంచకప్‌ దుబాయ్‌ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఫించ్‌ నేతృత్వంలో ఆసీస్‌ జట్టు తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను గెలిచింది. 

\ఇదిలా ఉంటే, టీ20 ర్యాంకింగ్స్‌లో గతేడాది చివరి నాటికి టాప్‌-8లో ఉన్న జ‌ట్లు ప్ర‌పంచ‌క‌ప్‌-2022కు నేరుగా అర్హ‌త సాధించగా.. మిగ‌తా నాలుగు స్థానాల కోసం క్వాలిఫైయ‌ర్ మ్యాచ్‌లు నిర్వ‌హిస్తారు. భార‌త్, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘ‌నిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లు ఇదివరకే ప్ర‌పంచ‌క‌ప్‌కు అర్హ‌త సాధించగా.. శ్రీలంక, వెస్టిండీస్, న‌మీబియా, స్కాట్లాండ్ జ‌ట్లు క్వాలిఫైయ‌ర్స్‌లో తలపడతాయి.
చదవండి: ఆ ఇద్దరి వల్లే టీమిండియా ఓడింది.. 'పురానే'పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Virat Kohli Vs Dean Elgar: సైలెంట్‌గా ఉంటానా డీన్‌.. 3 ఏళ్ల క్రితం ఏం చేశావో తెలుసు.. కోహ్లి మాటలు వైరల్‌

మరిన్ని వార్తలు