ICC: పురుష, మహిళా క్రికెట్‌ జట్ల మధ్య అంతరం తగ్గించే యోచనలో ఐసీసీ..!

31 Mar, 2022 14:07 IST|Sakshi

అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ ఆడే పురుష, మహిళా క్రికెట్‌ జట్ల ప్రైజ్‌మనీకి సంబంధించి ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) కీలక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ టోర్నీల్లో పాల్గొనే పురుష, మహిళా క్రికెట్‌ జట్ల ప్రైజ్‌మనీలో అంతరాన్ని తగ్గించే యోచనలో ఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఐసీసీ సీఈఓ జెఫ్‌ అలార్డైస్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతున్న మహిళల ప్రపంచకప్‌లో విజేతకు 1.32 మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ ఇవ్వనుండగా, 2019 పురుషుల వన్డే ప్రపంచకప్‌ విజేతకు ఏకంగా 4.8 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ ఇచ్చారు. పురుష జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీతో పోలిస్తే మహిళా క్రికెట్‌ జట్ల లభించే మొత్తం మూడో వంతు కూడా లేకపోవడంతో గత కొంతకాలంగా మహిళా క్రికెటర్లు నిరసన స్వరం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన చర్చల్లో భాగంగా పురుష, మహిళా క్రికెట్‌ జట్లకు సమాన ప్రైజ్‌మనీ అందించే అంశాన్ని ఐసీసీ అపెక్స్ కమిటీ పరిశీలిస్తుందని జెఫ్‌ అలార్డైస్‌ తెలిపారు. 
చదవండి: WC 2022: అదరగొట్టిన వ్యాట్‌.. 6 వికెట్లతో రాణించిన సోఫీ.. ఆసీస్‌తో పోరుకు సై

మరిన్ని వార్తలు