ICC T20 Rankings: దుమ్ము లేపిన సూర్యకుమార్‌.. ఏకంగా 44 స్థానాలు ఎగబాకి.. ఐదో ర్యాంకు!

13 Jul, 2022 14:56 IST|Sakshi
సూర్యకుమార్‌ యాదవ్‌(PC: BCCI)

ICC T20 Batting Rankings- Suryakumar Yadav: ఐసీసీ టీ20 క్రికెట్‌ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్‌ సూర్యకుయార్‌ యాదవ్‌ దుమ్ములేపాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన అతడు ఏకంగా 44 స్థానాలు ఎగబాకాడు. మొత్తంగా 732 పాయింట్లు సాధించిన సూర్య.. కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటాడు.

కాగా ఇంగ్లండ్‌తో టీమిండియా టీ20 సిరీస్‌లో సూర్యకుమార్‌ మెరుగైన ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. మొదటి టీ20లో 39 పరుగులు చేసిన సూర్య.. రెండో మ్యాచ్‌లో 15 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, మూడో టీ20 మ్యాచ్‌లో మాత్రం ఈ ముంబై బ్యాటర్‌ విశ్వరూపం ప్రదర్శించాడు.

55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగి 212 స్ట్రైక్‌రేటుతో 117 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైనా సూర్య అద్భుత ఇన్నింగ్స్‌ అభిమానులను ఆకట్టుకుంది. కాగా టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌కు ఇది తొలి సెంచరీ కావడం విశేషం. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న మూడు వన్డేల సిరీస్‌ జట్టులోనూ అతడు భాగమై ఉన్నాడు. ఇక సూర్య మినహా మరే ఇతర టీమిండియా బ్యాటర్‌కు టాప్‌-10లో చోటు దక్కకపోవడం గమనార్హం.

ఐసీసీ టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌- టాప్‌-10లో ఉన్నది వీళ్లే:
1.బాబర్‌ ఆజమ్‌(పాకిస్తాన్‌)- 818 పాయింట్లు
2. మహ్మద్‌ రిజ్వాన్‌(పాకిస్తాన్‌)- 794 పాయింట్లు
3.ఎయిడెన్‌ మార్కరమ్‌(దక్షిణాఫ్రికా)- 757 పాయింట్లు
4. డేవిడ్‌ మలన్‌(ఇంగ్లండ్‌)- 754 పాయింట్లు
5. సూర్యకుమార్‌ యాదవ్‌(ఇండియా)- 732 పాయింట్లు
6.ఆరోన్‌ ఫించ్‌(ఆస్ట్రేలియా)- 716 పాయింట్లు
7. డెవాన్‌ ​కాన్వే(న్యూజిలాండ్‌)- 703 పాయింట్లు
8.నికోలస్‌ పూరన్‌(వెస్టిండీస్‌)- 667 పాయింట్లు
9.పాథుమ్‌ నిశాంక(శ్రీలంక)- 661 పాయింట్లు
10. మార్టిన్‌ గఫ్టిల్‌(న్యూజిలాండ్‌), రసీ వాన్‌ డెర్‌ డసెన్‌(దక్షిణాఫ్రికా)- 658 పాయింట్లు.
చదవండి: ICC world Cup Super League: వన్డే సిరీస్‌ రద్దు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్‌! ప్రపంచకప్‌ రేసు నుంచి తప్పుకొన్నట్లేనా?
Surya Kumar Yadav: ప్రస్తుతం అతడిని ఎదుర్కోగల బౌలర్‌ ప్రపంచంలోనే ఎవరూ లేరు!

మరిన్ని వార్తలు