Hardik Pandya: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన హార్దిక్‌.. కెరీర్‌ బెస్ట్‌... ఏకంగా..

31 Aug, 2022 15:01 IST|Sakshi
హార్దిక్‌ పాండ్యా(PC: ICC/BCCI)

Asia Cup 2022 India Vs Pakistan- Hardik Pandya- ICC T20 Latest Rankings: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి ఆల్‌రౌండర్ల జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. తద్వారా కెరీర్‌లో తొలిసారిగా ఈ మేరకు అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. కాగా ఆసియా కప్‌-2022 టోర్నీలో పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌ సందర్భంగా హార్దిక్‌ పాండ్యా అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. 

అద్భుతంగా రాణించి..
చిరకాల ప్రత్యర్థి పాక్‌తో దుబాయ్‌ వేదికగా ఆదివారం(ఆగష్టు 28) సాగిన మ్యాచ్‌లో పాండ్యా బాల్‌తో, బ్యాట్‌తోనూ రాణించాడు. 4 ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసిన హార్దిక్‌.. 25 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక లక్ష్య ఛేదనలో భాగంగా.. ఆరోస్థానంలో బరిలోకి దిగాడు. 17 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 33 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే సిక్స్‌ బాది టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.

ఈ క్రమంలో 167 రేటింగ్‌ పాయింట్లు సాధించిన హార్దిక్‌ పాండ్యా ఐసీసీ టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఈ ర్యాంకింగ్స్‌లో అఫ్గనిస్తాన్‌ కెప్టెన్‌ మహ్మద్‌ నబీ మొదటి స్థానం(257 పాయింట్లు)లో కొనసాగుతున్నాడు.

ఐసీసీ తాజా టీ20 ఆల్‌రౌండర్ల జాబితా: టాప్‌-5లో ఉన్నది వీళ్లే
1. మహ్మద్‌ నబీ- అఫ్గనిస్తాన్‌(257)
2. షకీబ్‌ అల్‌ హసన్‌- బంగ్లాదేశ్‌(245)
3. మొయిన్‌ అలీ- ఇంగ్లండ్‌(221)
4. గ్లెన్‌ మాక్స్‌వెల్‌- ఆస్ట్రేలియా(183)
5. హార్దిక్‌ పాండ్యా- ఇండియా (167)

చదవండి: Rishabh Pant: జట్టులో పంత్‌కు ప్రస్తుతం స్థానం లేదు! అతడిని తప్పిస్తే గానీ.. చోటు దక్కదు! 
Asia Cup 2022: శ్రీలంకతో మ్యాచ్‌! మాకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి..

మరిన్ని వార్తలు