స్పెషల్‌ రికార్డు సృష్టించనున్న టీ20 ప్రపంచకప్‌-2022

15 Oct, 2022 21:13 IST|Sakshi

ICC T20 World CUP 2022 creates very SPECIAL RECORD: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2022 ప్రారంభం కాకముందే ఓ స్పెషల్‌ రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ మెగా ఈవెంట్‌.. ఏకంగా 222 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇప్పటి వరకు ఈ క్రికెట్‌ ఈవెంట్‌ కూడా ఇన్ని దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కాలేదు. ఇదే తొలి సారి కావడం విశేషం.

అదే విధంగా ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి దాదాపు 10,000 గంటల ప్రత్యక్ష ప్రసారాన్ని ఛానెల్‌లు ఇవ్వనున్నాయి. మరోవైపు ప్రపంచకప్‌ మ్యాచ్‌ జరిగే అన్ని స్టేడియాల్లో ఐసీసీ దాదాపు 35కు పైగా కెమరాలను ఏర్పాటు చేసింది. అదే విధంగా మ్యాచ్‌ హైలెట్స్‌ను T20worldcup.com, టీ20 వరల్డ్‌ కప్‌ యాప్‌లో గానీ వీక్షించవచ్చు.

భారత్‌లో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌ వర్క్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. స్టార్‌ స్పోర్ట్స్‌ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, మలయాళం వంటి ప్రాంతీయ బాషల్లో కూడా ప్రసారం చేయనుంది. ఇక ఆక్టోబర్‌ 16న గీలాంగ్ వేదికగా జరగనున్న శ్రీలంక-నమిబీయా మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్‌-2022కు తెరలేవనుంది.
చదవండి: చరిత్ర సృష్టించిన భారత కెప్టెన్‌.. ప్రపంచంలోనే తొలి మహిళా క్రికెటర్‌గా

>
మరిన్ని వార్తలు