‘అది జరిగితే మాత్రం ఏడాదంతా సంబరాలే’

30 Nov, 2020 16:03 IST|Sakshi

సిడ్నీ: ప్రస్తుతం జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా గడ్డపై ఏ ఒక్క సిరీస్‌ను టీమిండియా గెలుచుకునే పరిస్థితే లేదని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ ఇప్పటికే ఎద్దేవా చేయగా, అసలు విరాట్‌ కోహ్లి లేకుండా ఆసీస్‌పై ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలుస్తుందా అంటూ ఆ దేశ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ సందేహం వ్యక్తం చేశాడు. ఒకవేళ విరాట్‌ కోహ్లి లేకుండా తమ దేశంలో సిరీస్‌ గెలిస్తే టీమిండియా సెలబ్రేషన్స్‌ను ఊహించడమే కష్టమన్నాడు. కోహ్లి లేకుండా ఆస్ట్రేలియా గడ్డపై మమ్మల్ని ఓడించినట్లయితే ఆ జట్టు ఏడాదంతా సంబరాలు చేసుకుంటుందన్నాడు. ఇండియా టుడేతో ఇన్సిరేషన్‌ ఎపిసోడ్‌లో క్లార్క్‌ మాట్లాడుతూ..  ‌‘టీమిండియాకు విరాట్‌ కోహ్లి అందుబాటులో ఉంటే కెప్టెన్సీ పరంగా, బ్యాటింగ్‌ పరంగా బలంగా ఉంటుంది. కోహ్లి స్థానంలో ఎవరు బ్యాటింగ్‌ చేస్తారు. రాహుల్‌ అయితేనే కరెక్ట్‌. అతనొక టాలెంటెడ్‌ క్రికెటర్‌. అందులో ఎటువంటి సందేహం లేదు. (చదవండి: కోహ్లి 2020)

ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉన్న క్రికెటర్‌. కానీ కోహ్లి లేని లోటు మాత్రం ఎవరూ భర్తీ చేయలేరు. కెప్టెన్‌గా కోహ్లి బాధ్యతలను రహానే తీసుకుంటాడు. రహానే మంచి ప్లేయరే కాకుండా కెప్టెన్సీ స్కిల్స్‌ కూడా బాగానే ఉన్నాయి. టీమిండియాను నడిపించే సామర్థ్యం రహానేలో ఉంది. అతనికి మంచి అవకాశం ముందుంది. రహానేకు కొత్త చరిత్రను సృష్టించే అవకాశం ఉంది. ఒకవేళ రహానే సారథ్యంలోనే టెస్టు సిరీస్‌ను గెలిస్తే  టీమిండియా సెలబ్రేషన్స్ ఆకాశాన్ని తాకుతాయి. కచ్చితంగా ఏడాదంతా ఆ సెలబ్రేషన్స్‌ మునిగితేలుతారు. ఎందుకంటే కోహ్లి లేకుండా ఆస్ట్రేలియాలో ఆసీస్‌ను ఓడించడమంటే అది కచ్చితంగా అసాధారణమే. టీమిండియా పటిష్టంగా ఉంది. ఆసీస్‌ను ఓడించగలం అనే విశ్వాసాన్ని వారు కోల్పోకూడదు’ అని క్లార్క్‌ పేర్కొన్నాడు.(చదవండి: ‘బుమ్రాను ఎలా వాడాలో తెలియని కెప్టెన్సీ ఇది’)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా