IPL 2022: 'ఉమ్రాన్‌ మాలిక్‌ పాకిస్తాన్‌లో ఉండి ఉంటే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేవాడు'

13 May, 2022 20:23 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్పీడ్‌గన్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. కాగా మాలిక్‌ను భారత జట్టులోకి వెంటనే తీసుకోవాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ ఆక్మల్‌ అసక్తికర వాఖ్యలు చేశాడు. ఉమ్రాన్ మాలిక్ పాకిస్తాన్‌లో ఉండి ఉంటే ఇప్పటికే అంతర్జాతీయ అరంగేట్రం చేసే వాడని ఆక్మల్‌ అభిప్రాయపడ్డాడు. "మాలిక్‌ పాకిస్తాన్‌లో ఉండి ఉంటే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడి ఉండేవాడు. అతడు బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు సమర్పించుకుంటున్నాడు. అయితే అతడు వికెట్‌ టేకింగ్‌ బౌలర్‌. అతడు గంటకు 155 కిమీ వేగంతో బౌలింగ్‌ చేస్తున్నాడు. మ్యాచ్‌ మ్యాచ్‌కు అతడి బౌలింగ్‌లో వేగం పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.

ఉమ్రాన్‌ గత సీజన్‌లో ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు.  బ్రెట్ లీ, అక్తర్‌ కూడా చాలా పరుగులు ఇచ్చే వారు. కానీ వికెట్లు పడగొట్టేవారు. ఇంతకుముందు, భారత క్రికెట్‌లో నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు లేరు, కానీ ఇప్పుడు వారికి నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ జస్ప్రీత్ బుమ్రా వంటి పేసర్లు చాలా మంది ఉన్నారు. ఉమేష్ యాదవ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 10 నుంచి12 మంది పేసర్లు ఉండడంతో భారత సెలెక్టర్లు ఎంపిక చేయడం కష్టతరంగా మారింది" అని కమ్రాన్‌ ఆక్మల్‌  పేర్కొన్నాడు.

చదవండి: IPL 2022: 'నా తొలి మ్యాచ్‌ను మా నాన్న ప్రొజెక్టర్‌లో చూశారు'

మరిన్ని వార్తలు