PAK vs WI 2nd ODI: పాక్‌ కెప్టెన్‌పై తిట్ల దండకం.. వీడియో వైరల్‌

10 Jun, 2022 21:20 IST|Sakshi

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంపై తోటి బ్యాటర్‌ తిట్ల దండకం అందుకున్నాడు. అనవసరంగా రనౌట్‌ చేశాడన్న కారణంతో పాక్‌ కెప్టెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. 17 పరుగులు చేసి ఫఖర్‌ జమాన్‌ ఔటైన తర్వాత బాబర్‌ ఆజం క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌తో కలిసి పాక్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఇద్దరి మధ్య రెండో వికెట్‌కు 120 పరుగులు కీలక భాగస్వామ్యం కూడా ఏర్పడింది.

తమ బ్యాటింగ్‌తో ప్రమాదకరంగా మారుతున్న సమయంలో బాబర్‌ ఆజం చేసిన చిన్న తప్పు వికెట్‌ పడేలా చేసింది. ఇన్నింగ్స్‌ 28వ ఓవర్‌లో అకీల్‌ హొసేన్‌ బౌలింగ్‌కు వచ్చాడు. ఇమాముల్‌ హక్‌ మిడ్‌వికెట్‌ దిశగా ఆడి సింగిల్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి ఎక్కువ దూరం వెళ్లకపోవడంతో బాబర్‌ పరుగు తీయలేదు. అయితే అప్పటికే ఇమాముల్‌ హక్‌ సగం క్రీజు దాటి నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌కు వచ్చేశాడు. బాబర్‌ పిలుపుతో వెనక్కి వెళ్లినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

బంతిని అందుకున్న షెయ్ హోప్‌ వికెట్లను గిరాటేయడంతో ఇమాముల్‌ హక్ 72 పరుగుల వద్ద రనౌట్‌ అయ్యాడు. అంతే ఇమాముల్‌ హక్‌లో కోపం కట్టలు తెచ్చుకుంది. పెవిలియన్‌కు వెళ్తూ బ్యాట్‌ను కింద కొట్టుకుంటూనే తిట్ల దండకం అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత బాబర్‌ ఆజం 77 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓవరాల్‌గా పాకిస్తాన్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. కాగా బాబర్‌ ఆజం, ఇమాముల్‌ హక్‌లకు ఇది వరుసగా ఆరో అర్థసెంచరీలు కావడం విశేషం. 

చదవండి:  దీనస్థితిలో ఉత్తరాఖండ్‌ రంజీ ఆటగాళ్లు .. రోజూవారి వేతనం తెలిస్తే షాకవుతారు

'కిల్లర్‌' మిల్లర్‌ అనగానే ఆ ఎపిక్‌ ఎంట్రీ గుర్తుకురావడం ఖాయం

A post shared by Pakistan Cricket (@therealpcb)

మరిన్ని వార్తలు