IND Vs AUS 2nd ODI: భారత్‌-ఆస్ట్రేలియా రెండో వన్డే.. విశాఖకు చేరుకున్న సునీల్ గావస్కర్

18 Mar, 2023 17:41 IST|Sakshi

విశాఖపట్నం వేదికగా భారత్‌- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డేకు రంగం సిద్దమైంది. ఆదివారం(మార్చి 19)న జరగనున్న ఈ మ్యాచ్‌కు నిర్వహాకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు దాదాపు 25 వేల మంది స్టేడియంకు రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రెండో వన్డేకు వాఖ్యతగా వ్యవహరించనున్న టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ విశాఖకు శనివారం చేరుకున్నారు. అతడికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపీనాథ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.

మ్యాచ్‌కు వర్షం ముప్పు..
అయితే ఈ  మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.మార్చి 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం మ్యాచ్‌ జరిగే సమయంలో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షం పడే ఛాన్స్‌ ఉంది ఉందని భారత వాతావరణ విభాగం (IMD) ఓ ప్రకటనలో పేర్కొంది. 

మరోవైపు వర్షం పడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు.. స్టేడియం నిర్వాహకులు తెలిపారు. వర్షం నుంచి మైదానాన్ని రక్షించేందుకు అవసరమైన అత్యంత తేలికైన పిచ్‌ కవర్లు తమ వద్ద ఉన్నట్లు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కూడా ఓ ప్రకటనలో  వెల్లడించింది. కాగా ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. 

తుది జట్లు(అంచనా)
భారత్‌: శుబ్‌మన్ గిల్, రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్‌ రాహుల్(వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్‌), మార్నస్ లాబుషేన్‌, జోష్ ఇంగ్లిస్(వికెట్‌ కీపర్‌), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

మరిన్ని వార్తలు