IND Vs AUS 2nd ODI: ఆసీస్‌ ఓపెనర్ల విధ్వంసం.. రెండో వన్డేలో భారత్‌ ఓటమి

19 Mar, 2023 17:32 IST|Sakshi

ఆసీస్‌ ఓపెనర్ల విధ్వంసం.. రెండో వన్డేలో భారత్‌ ఓటమి
టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. వికెట్‌ నష్టపోకుండా 11 ఓవర్లలోనే చేదించింది. ఆసీస్‌ ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌(36 బంతుల్లో 66 నాటౌట్‌), ట్రావిస్‌ హెడ్‌(30 బంతుల్లో 51 నాటౌట్‌) విధ్వంసం సృష్టించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. ఆసీస్‌ బౌలర్లు నిప్పులు చేరగడంతో కేవలం 117 పరుగులకే కుప్పకూలింది.ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్  5వికెట్లతో టీమిండియా వెన్ను విరచగా.. అబాట్‌ మూడు, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు సాధించారు.

విజయానికి చేరువలో ఆసీస్‌..
118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌..  8 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఆసీస్‌ ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌(54) హాఫ్‌ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఇప్పటి వరకు 5 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అతడితో పాటు హెడ్‌(32) పరుగులతో క్రీజులో ఉన్నాడు.

118 పరుగుల టార్గెట్‌.. దూకుడుగా ఆడుతున్న ఆసీస్‌
118 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతుంది. 3 ఓవర్లలో ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్‌ (10), ట్రవిస్‌ హెడ్‌ (10) క్రీజ్‌లో ఉన్నారు. 

నిప్పులు చెరిగిన ఆసీస్‌ పేసర్లు.. 117 పరుగులకే కుప్పకూలిన భారత్‌
టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. మిచెల్‌ స్టార్క్‌ (5/53), సీన్‌ అబాట్‌ (3/23), నాథన్‌ ఇల్లీస్‌ (2/13) నిప్పులు చెరగడంతో  భారత్‌ను 117 పరుగులకే ఆలౌట్‌ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి (31) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

103 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా
103 పరుగుల వద్ద టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. కుల్దీప్‌ (4), షమీ (0)లను అబాట్‌ పెవిలియన్‌కు పంపాడు. క్రీజులో అక్షర్‌ పటేల్‌, సిరాజ్‌ ఉన్నారు.

ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. జడ్డూ (16) ఔట్‌
91 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. నాథన్‌ ఇల్లీస్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ అలెక్స్‌ క్యారీ క్యాచ్‌ పట్టడంతో రవీంద్ర జడేజా (16) ఔటయ్యాడు. అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ క్రీజ్‌లో ఉన్నారు.

ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌... కోహ్లి ఔట్‌
71 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. నాథన్‌ ఇల్లీస్‌ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లి (31) ఎల్బీడబ్ల్యూ ఔటయ్యాడు. 

స్మిత్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌.. 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన భారత్‌
ఫస్ట్‌ స్లిప్‌లో స్టీవ్‌ స్మిత్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ పట్టడంతో హార్ధిక్‌ పాం‍డ్యా (1) పెవిలియన్‌ బాటపట్టక తప్పలేదు. దీంతో టీమిండియా 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. విరాట్‌ కోహ్లి (22), జడేజా క్రీజ్‌లో ఉన్నాడు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. రాహుల్‌ ఔట్‌, 4 వికెట్లు స్టార్క్‌ ఖాతాలోకే
మిచెల్‌ స్టార్క్‌ టీమిండియాను దారుణంగా దెబ్బకొడుతున్నాడు. ఇప్పటికే 3 వికెట్లు పడగొట్టిన స్టార్క్‌.. కేఎల్‌ రాహుల్‌ (9)ను కూడా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 9 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 49/4. కోహ్లి (22), హార్ధిక్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన భారత్‌.. స్కై మరో డకౌట్‌
టీమిండియా కష్టాల్లో పడింది. స్టార్క్‌ వరుస బంతుల్లో​ రోహిత్‌ శర్మ (13), సూర్యకుమార్‌ యాదవ్‌లకు ఔట్‌చేసి టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టాడు. 4.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 32/3గా ఉంది. విరాట్‌ కోహ్లి (15), కేఎల్‌ రాహుల్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

రోహిత్‌ శర్మ ఔట్‌.. రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
13 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ స్టార్క్‌ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది.

మూడు ఓవర్లలో టీమిండియా స్కోరు 29/1
మూడు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్‌ నష్టానికి 29 పరుగులు చేసింది. కోహ్లి 14, రోహిత్‌ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

గిల్‌ డకౌట్‌..
ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే టీమిండియాకు షాక్‌ తగిలింది. మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో గిల్‌ డకౌట్‌ అయ్యాడు. లబుషేన్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్‌ నష్టానికి నాలుగు పరుగులు చేసింది.

తొలుత బ్యాటింగ్‌ చేయనున్న భారత్‌
విశాఖ వేదికగా ఇవాళ (మార్చి 19) జరుగుతున్న భారత్‌-ఆస్ట్రేలియా రెండో వన్డే వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోతుందేమోనని ఆందోళన చెందిన అభిమానులకు శుభవార్త. వరుణుడు శాంతించి, ఎండ కాయడంతో జరుగదనుకున్న మ్యాచ్‌ మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఆసీస్‌ రెండు మార్పులతో బరిలోకి దిగనుండగా.. టీమిండియా ఒక్క మార్పు చేసింది. మ్యాక్స్‌వెల్‌ స్థానంలో నాథన్‌ ఇల్లీస్‌, జోస్‌ ఇంగ్లిస్‌ ప్లేస్‌లో అలెక్స్‌ క్యారీ బరిలోకి దిగనుండగా.. భారత్‌ నుంచి శార్దూల్‌ ఠాకూర్‌ స్థానాన్ని అక్షర్‌ పటేల్‌ భర్తీ చేయనున్నాడు.  

తుది జట్లు..
భారత్‌: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్‌ రాహుల్(వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్‌), మార్నస్ లాబుషేన్‌, అలెక్స్‌ క్యారీ(వికెట్‌ కీపర్‌), కామెరాన్ గ్రీన్, నాథన్‌ ఇల్లీస్‌, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

మరిన్ని వార్తలు