Ind vs Aus: టాస్‌ గెలిచిన ఆసీస్‌.. తుది జట్లు ఇవే.. అశ్విన్‌, ఇషాన్‌ అవుట్‌.. అతడి ఎంట్రీ

27 Sep, 2023 13:05 IST|Sakshi

India vs Australia, 3rd ODI: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను 2-0తో గెలిచిన టీమిండియా నామమాత్రపు మూడో వన్డేకు సిద్ధమైంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ నంబర్‌ 1గా ఉన్న రోహిత్‌ సేన ఆసీస్‌ను వైట్‌వాష్‌ చేసి రెట్టించిన ఉత్సాహంతో ప్రపంచకప్‌-2023 బరిలో నిలవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. కనీసం ఒక్క వన్డేలోనైనా గెలిచి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.

అశ్విన్‌, ఇషాన్‌ అవుట్‌.. సుందర్‌ ఎంట్రీ
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌తో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా విరాట్‌ కోహ్లి, కుల్దీప్‌ యాదవ్‌ తదితరులు తిరిగి జట్టుతో కలిశారు.

ఇక గత రెండు వన్డేల్లో భాగమైన టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ మూడో వన్డేతో ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు.. వైరల్‌ ఫీవర్‌ కారణంగా ఇషాన్‌ కిషన్‌ జట్టుకు దూరమయ్యాడు.

తుది జట్లు ఇవే
టీమిండియా:

రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

ఆస్ట్రేలియా
మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సింగ్, జోష్ హేజిల్‌వుడ్‌.

చదవండి: 314 పరుగులు.. టీ20 చరిత్రలో నేపాల్‌ సంచలనం! ప్రపంచ రికార్డులు బద్దలు

మరిన్ని వార్తలు