Ind Vs Aus: పాపం.. అలా అయితే పాక్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరేదేమో! తిక్క కుదిరిందా?

11 Feb, 2023 13:26 IST|Sakshi
ఆస్ట్రేలియాతో టెస్టులో టీమిండియా

India vs Australia- World Test Championship: టీమిండియా- ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ నేపథ్యంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ పాకిస్తాన్‌ అభిమానికి భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు. సానుకూల దృక్పథంతో ఉండటం తప్పు కాదంటూనే పాక్‌ జట్టు వైఫల్యాలు ఎత్తిచూపుతూ సెటైర్లు వేశాడు. కాగా భారత్‌ వేదికగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో టీమిండియా హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది.

ఇరు జట్ల మధ్య నాగ్‌పూర్‌లో గురువారం తొలి టెస్టు ఆరంభం కాగా.. ఆది నుంచి రోహిత్‌ సేన ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే.. ఓ ట్విటిజెన్‌.. ‘‘భారత గడ్డపై టీమిండియాను ఓడించగల సత్తా కేవలం పాకిస్తాన్‌కు మాత్రమే ఉంది’’ అంటూ కామెంట్‌ చేశాడు.

పాపం.. పాకిస్తాన్‌! తిక్క కుదిరింది..
ఇందుకు స్పందించిన ఆకాశ్‌ చోప్రా.. ‘‘నీ సానుకూల దృక్పథం నాకు నచ్చిందబ్బాయ్‌! అయితే.. ఒకటి కనీసం సొంతగడ్డపై అయినా మీ జట్టు సిరీస్‌లు గెలవొచ్చు కదా! ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లతో స్వదేశంలో సిరీస్‌లు ఏమయ్యాయి. 

విదేశీ గడ్డపై బంగ్లాదేశ్‌, శ్రీలంక, వెస్టిండీస్‌ల సిరీస్‌లు అన్నిటిలో పాకిస్తాన్‌ గెలిచి ఉంటే గనుక ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరి ఉండేది’’ అంటూ అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చాడు. ఇందుకు స్పందించిన టీమిండియా ఫ్యాన్స్‌.. ‘‘తిక్క బాగా కుదిర్చావు! దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చావు ఆకాశ్‌ భాయ్‌’’ అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఫైనల్‌ పోరులో
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23లో భాగంగా ఆఖరి టెస్టు సిరీస్‌ ఆడుతున్న భారత్‌.. ఆసీస్‌పై గెలిస్తే ఫైనల్‌ చేరడం ఖాయం. మరోవైపు.. ఆస్ట్రేలియా సైతం దాదాపు ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక పాకిస్తాన్‌ సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో వైట్‌వాష్‌కు గురవడం సహా ఇతర సిరీస్‌లు గెలవలేకపోయింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంతో ముగించింది.

చదవండి: IND vs AUS: సిక్సర్లతో చెలరేగిన షమీ.. ఆసీస్‌ స్పిన్నర్‌కు చుక్కలు! వీడియో వైరల్‌
Todd Murphy: 7 వికెట్లతో చెలరేగిన ఆసీస్‌ సంచలనం.. మరో రికార్డు!

మరిన్ని వార్తలు