Ind Vs Aus: భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా.. షెడ్యూల్‌, జట్లు, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు.. వైట్‌వాష్‌ ఎన్నిసార్లంటే!

6 Feb, 2023 10:47 IST|Sakshi

Australia tour of India, 2023- Ind Vs Aus Test Series: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2021-23లో ఫైనలిస్టులను ఖరారు చేసే కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ప్యాట్‌ కమిన్స్‌ బృందం తమ బెర్తును దాదాపు ఖరారు చేసుకోగా.. రోహిత్‌ సేన స్వదేశంలో సత్తా చాటి తుది పోరుకు అర్హత సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య భారత్‌ వేదికగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ఫిబ్రవరి 9 నుంచి మొదలుకానుంది.

ఇందులో భాగంగా ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా భారత స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవడంతో పాటు.. టీమిండియా బ్యాటర్ల కోసం తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. దీంతో ఈసారి బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ మరింత రసవత్తరంగా మారనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా- ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ పూర్తి షెడ్యూల్‌, జట్లు, లైవ్‌ స్ట్రీమింగ్‌ తదితర వివరాలు తెలుసుకుందాం.

టీమిండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ 2023
నాలుగు మ్యాచ్‌లు
తొలి టెస్టు: ఫిబ్రవరి 09, గురువారం- ఫిబ్రవరి 13, సోమవారం- విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం, నాగ్‌పూర్‌, మహారాష్ట్ర
రెండో టెస్టు: ఫిబ్రవరి 17, శుక్రవారం- ఫిబ్రవరి 21, మంగళవారం- అరుణ్‌ జైట్లీ స్టేడియం, ఢిల్లీ
మూడో టెస్టు: మార్చి 01, బుధవారం- మార్చి 5, ఆదివారం- హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం, ధర్మశాల
నాలుగో టెస్టు: మార్చి 09, గురువారం- మార్చి 13, సోమవారం- నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్‌, గుజరాత్‌

మ్యాచ్‌ ఆరంభ సమయం:
►భారత కాలమానం ప్రకారం అన్ని మ్యాచ్‌లు ఉదయం 9.30 గంటలకు ఆరంభం
ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడంటే...
►టీవీ: స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌
►డిజిటల్‌ మీడియా: డిస్నీ+ హాట్‌స్టార్‌
►అదే విధంగా జియోటీవీలో మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించవచ్చు.

జట్లు:
టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్ (వైస్‌ కెప్టెన్‌), శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ , మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్.

ఆస్ట్రేలియా
పాట్ కమిన్స్ (కెప్టెన్‌), ఆష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ (వికెట్‌ కీపర్‌), కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, పీటర్ హ్యాండ్‌స్కాంబ్ (వికెట్‌ కీపర్‌), ట్రవిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌, నాథన్ లియోన్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్షా , స్టీవ్ స్మిత్ (వైస్‌ కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్.

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ చరిత్ర
1947-96 మధ్య కాలంగలో టీమిండియా, ఆస్ట్రేలియా 50కి పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఈ క్రమంలో 1996 తర్వాత ఇరు జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీగా నామకరణం చేశారు. క్రికెట్‌ రంగంలో విశేష సేవలు అందించిన భారత దిగ్గజం సునిల్‌ గావస్కర్‌, ఆస్ట్రేలియా లెజెండ్‌ అలెన్‌ బోర్డర్‌ల గౌరవార్థం ఈ పేరు పెట్టారు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో 10 వేలకు పైగా పరుగుల మార్కును అందుకున్న ఆటగాళ్లుగా వీరు ఘనత సాధించారు.

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ అత్యధిక సార్లు గెలిచిందెవరంటే!
►1996-97: భారత్‌ 1-0
►1997-98: భారత్‌ 2-1
►1999-00: ఆస్ట్రేలియా 3-0
►2000-01: భారత్‌ 2-1
►2003-04: డ్రా 1-1
►2004-05: ఆస్ట్రేలియా 2-1
►2007-08: ఆస్ట్రేలియా 2-1
►2008-09: భారత్‌ 2-0
►2010 -11: భారత్‌ 2-0
►2011-12: ఆస్ట్రేలియా 4-0
►2012-13: భారత్‌ 4-0
►2014-15: ఆస్ట్రేలియా 2-0
►2016 – 17: భారత్‌ 2-1
►2018-19: భారత్‌ 2-1
►2020-21: భారత్‌ 2-1

చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. ఆంధ్ర ఆటగాడు అరంగేట్రం! కిషన్‌కు నో ఛాన్స్‌
SA20: క్లాసెన్ సూపర్‌ సెంచరీ.. 151 పరుగుల తేడాతో సూపర్ జెయింట్స్ భారీ విజయం

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు