Shubman Gill: బౌండరీతో సెంచరీ పూర్తి చేసుకున్న గిల్‌..! అద్భుత షాట్లు.. వీడియో వైరల్‌

11 Mar, 2023 15:18 IST|Sakshi

India vs Australia, 4th Test- Shubman Gill Century: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ శతకంతో మెరిశాడు. ఆసీస్‌ స్పిన్నర్‌  టాడ్‌ మర్ఫీ బౌలింగ్‌లో బౌండరీ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా శుబ్‌మన్‌కు టెస్టుల్లో ఇది రెండో శతకం. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌లో మొదటిది. ఇక కేఎల్‌ రాహుల్‌ స్థానంలో మూడో టెస్టుతో గిల్‌ తుదిజట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.

కీలక సమయంలో సెంచరీ
కానీ, ఇండోర్‌ మ్యాచ్‌లో కేవలం 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు ఈ యువ బ్యాటర్‌. అయితే, నాలుగో టెస్టులో మాత్రం బ్యాట్‌ ఝులిపించడం విశేషం. అహ్మదాబాద్‌ టెస్టులో మూడో రోజు ఆటలో భాగంగా కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 35 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. దీంతో బాధ్యత మరో ఓపెనర్‌ గిల్‌, వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఛతేశ్వర్‌ పుజారాపై పడింది. 

ఈ క్రమంలో వీరిద్దరు చక్కగా సమన్వయం చేసుకుంటూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించారు.  ఈ నేపథ్యంలో గిల్‌ 10 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో శతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు పుజారా.. 42 పరుగులతో రాణించాడు. అయితే, గిల్‌ శతకం పూర్తైన తర్వాత నాలుగో బంతికే పుజారా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 187 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది.

ఇక అహ్మదాబాద్‌లో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలో మూడో రోజు ఆటలో టీమిండియా గిల్‌ సెంచరీ ఇన్నింగ్స్‌కు తోడు పుజారా రాణించడంతో పట్టు సాధించగలిగింది. 

చదవండి: Ind Vs Aus: కోహ్లికి సాధ్యం కాలేదు.. పుజారా సాధించాడు! ‘తొలి బ్యాటర్‌’గా..
NZ Vs SL: డ్రా అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్‌

మరిన్ని వార్తలు