AUS vs IND: విశాఖలో భారత్‌-ఆసీస్‌ రెండో వన్డే.. అభిమానులకు బిగ్‌ అలర్ట్‌

8 Mar, 2023 11:41 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా భారత జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా మార్చి 19న విశాఖపట్నం వేదికగా భారత్‌ ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌ టికెట్లను శనివారం(మార్చి 10) నుంచి విక్రయించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసొసియేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

మార్చి 10 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఏసీఏ సెక్రటరీ ఎస్ గోపినాథరెడ్డి తెలిపారు. అదే విధంగా 13న ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్లను విక్రయించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. టికెట్ల ధరలు రూ.600, రూ.1,500, రూ.2000, రూ.3000, రూ.3,500, రూ.6000గా నిర్ణయించామని గోపినాథరెడ్డి వెల్లడించారు. ఇక మార్చి 17న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

రెండో వన్డేకు విశాఖ..  ఆఖరి వన్డేకు చెన్నైలోని చెపాక్ స్టేడియం అతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే ఆసీస్‌తో తొలి వన్డేకు మాత్రం టీమిండియా రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండనున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు సారథిగా హార్దిక్‌ పాండ్యా వ్యవహరించనున్నాడు.

ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు..   
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్ధిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, ఇషాన్ కిషన్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, యుజ్వేంద్ర చహల్‌, శార్ధూల్‌ ఠాకూర్‌

మరిన్ని వార్తలు