IND vs BAN: ఇషాన్‌ కిషన్‌ విధ్వంసం.. డబుల్‌ సెంచరీతో చెలరేగిన జార్ఖం‍డ్‌ డైన్‌మేట్‌

10 Dec, 2022 14:27 IST|Sakshi

బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ అద్భుతమైన డబుల్‌ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ స్థానంలో బరిలోకి దిగిన కిషన్‌.. బంగ్లాదేశ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు.  ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న కిషన్‌ 23 ఫోర్లు, 10 సిక్స్‌లతో  210 పరుగులు చేశాడు. కాగా కిషన్‌ తన డబుల్‌ సెంచరీని కేవలం 126 బంతుల్లోనే పూర్తి చేశాడు. కిషన్‌ తన కెరీర్‌లో తొలి సెంచరీనే ద్విశతకంగా మలుచుకున్నాడు.

ఇక వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా కిషన్‌ రికార్డులకెక్కాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్‌ శర్మ ఈ ఘనతను సాధించారు. ఇక ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన జాబితాలో కిషాన్‌ ఏడో  స్థానంలో నిలిచాడు.
చదవండిIND vs BAN: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌.. 12 ఏళ్ల తర్వాత భారత బౌలర్‌ రీ ఎంట్రీ!

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు