Team India Practice: తొలి మ్యాచ్‌లో విఫలం.. అందరి దృష్టి అతడిపైనే! ద్రవిడ్‌ మార్గదర్శనంలో..

21 Dec, 2022 12:07 IST|Sakshi
టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌(PC: Twitter)

Bangladesh vs India, 2nd Test: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు నేపథ్యంలో టీమిండియా ప్రాక్టీసులో తలమునకలైంది. మీర్పూర్‌ మ్యాచ్‌ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. అయితే, మొదటి సెషన్‌కు టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి గైర్హాజరు కాగా.. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ నెట్స్‌లో చెమటోడ్చారు.

ముఖ్యంగా తొలి మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్‌ రాహుల్‌(22, 23 పరుగులు) కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మార్గదర్శనంలో తన టెక్నిక్‌ను మెరుగుపరచుకునే పనిలో పడ్డాడు. రాహుల్‌ బ్యాటింగ్‌ను దగ్గరుండి పర్యవేక్షించిన ద్రవిడ్‌.. లోపాలు సరిదిద్దుతూ.. మెళకువలు నేర్పాడు. అదే విధంగా మొదటి టెస్టులో రాణించిన ఛతేశ్వర్‌ పుజారా, శుబ్‌మన్‌ గిల్‌ సైతం ఈ ఆప్షనల్‌ ప్రాక్టీసు సెషన్‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అర్జెంటీనా జెర్సీతో..
ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌ జట్టు మొత్తం మంగళవారం నాటి ప్రాక్టీసు సెషన్‌లో పాల్గొంది. ఇందులో భాగంగా కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ అర్జెంటీనా జెర్సీ ధరించి ఫుట్‌బాల్‌ ఆడటం విశేషం. కాగా ఫిఫా వరల్డ్‌కప్‌-2022 ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆనందాన్ని ఇలా సెలబ్రేట్‌ చేసుకుంది షకీబ్‌ బృందం.

మీర్పూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌- టీమిండియా మధ్య గురువారం రెండో టెస్టు ఆరంభం కానుంది. ఇక ఈ టెస్టుకు కూడా రెగ్యులర్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మ దూరమయ్యాడు. దీంతో రాహుల్‌ సారథిగా వ్యవహరించనున్నాడు. ఇక రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ దిశగా దూసుకుపోతోంది.

చదవండి: Babar Azam: ఒక్క మాటతో రమీజ్‌ రాజా నోరు మూయించిన బాబర్‌! అది సాధ్యం కాదు.. ప్రతి వాడూ..
Ben Stokes: పాక్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌.. కోహ్లి రికార్డు సమం చేసిన స్టోక్స్‌.. అరుదైన జాబితాలో చోటు

మరిన్ని వార్తలు