T20 WC 2022: భారత్‌- బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే?

1 Nov, 2022 09:22 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్‌కు టీమిండియా సన్నద్దం అవుతోంది. ఆడిలైడ్‌ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి తమ సెమీ అవకాశాలను మరింత పదిలం చేసుకోవాలని రోహిత్‌ సేన భావిస్తోంది. అయితే భారత్‌ ఆశలపై వరుణుడు నీళ్లు జల్లే అవకాశం ఉంది.

ఈ కీలక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు అక్కడ వాతావరణ శాఖ తెలిపింది. గత రెండు రోజుల నుంచి ఆడిలైడ్‌లో తేలికపాటి జల్లులు కురుసున్నాయి. మంగళవారం కూడా అక్కడ వర్షం కురుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ వాఖ్యాత హర్ష భోగ్లే ట్విటర్‌ వేదికగా తెలిపారు. "అదృష్టవశాత్తూ.. ఈ రోజు ఆడిలైడ్‌లో ఎటువంటి మ్యాచ్‌ లేదు. ప్రస్తుతం ఇక్కడ వాతావారం చాలా కూల్‌గా ఉంది.

చిన్న చిన్న జల్లులు కురుస్తున్నాయి. అయితే రేపు(బుధవారం) ఇక్కడ వాతావారణం కొంచెం మెరుగ్గా ఉండే అవకాశం ఉంది" బోగ్లే ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా  భారత ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దు చేసుకుని హోటల్‌ గదులకే పరిమితమైనట్లు తెలుస్తోంది. కాగా గ్రూపు-2 నుంచి పాయింట్ల పట్టికలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ నేరుగా సెమీస్‌ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో తప్పక విజయం సాధించాలి.

భారత్- బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ రద్దు అయితే?
ఒక వేళ దురదృష్టవశాత్తూ భారత్‌- బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభిస్తుంది. అప్పుడు భారత్‌ ఐదు పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఈ క్రమంలో జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్‌లో టీమిండియా ఖచ్చితంగా విజయం సాధించాలి. అప్పడు భారత్‌ ఖాతాలో రెండు పాయింట్లు చేరడంతో మొత్తంగా 7 పాయింట్లు అవుతాయి.  ఒక వేళ పాకిస్తాన్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఇంటిముఖం పట్టక తప్పదు. ఎందుకంటే రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే పాక్‌ ఖాతాలో నాలుగు పాయింట్లు వచ్చి చేరుతాయి.

అప్పుడు ఓవరాల్‌గా పాకిస్తాన్‌కు ఆరు పాయింట్లు ఉంటాయి. అయితే భారత్‌ ఖాతాలో ఏడు పాయింట్లు ఉంటాయి కాబట్టి పాక్‌తో ఎటువంటి సమస్య లేదు. ఒక వేళ తమ చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై బం‍గ్లాదేశ్‌ విజయం సాధిస్తే.. రెండు పాయింట్లు బంగ్లా ఖాతాలో చేరుతాయి. అప్పుడు భారత్‌, బం‍గ్లాదేశ్‌ 7 పాయింట్లతో సమం అవుతాయి.

అయితే బంగ్లాదేశ్‌ కంటే భారత్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉంది కాబట్టి సెమీస్‌లో అడుగు పెడుతోంది. మరోవైపు జింబాబ్వే వరుసగా పాకిస్తాన్‌, భారత్‌పై విజయం సాధిస్తే ఏడు పాయింట్లతో సెమీస్‌కు చేరుకుంటుంది. ఇక ఐదు పాయింట్లతో అగ్ర స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరడం దాదాపు ఖాయమైనట్లే. ఎందుకంటే ప్రోటీస్‌ తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం సాధించినా చాలు.
చదవండిT20 World Cup 2022: శ్రీలంకతో మ్యాచ్‌.. ఆఫ్గాన్‌కు భారీ షాక్‌!

Poll
Loading...
మరిన్ని వార్తలు