Ind Vs Eng 1st ODI Highlights: టీమిండియా ఆరేళ్ల తర్వాత.. పాపం ఇంగ్లండ్‌ సొంతగడ్డపై చెత్త రికార్డు!

13 Jul, 2022 10:15 IST|Sakshi
వికెట్‌ తీసిన ఆనందంలో బుమ్రా(PC: ECB)

India tour of England, 2022 - Ind Vs Eng 1st ODI: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా 6 వికెట్లతో చెలరేగడంతో పాటుగా మహ్మద్‌ షమీ సైతం అతడికి తోడు కావడంతో ఆతిథ్య ఇంగ్లండ్‌ను 110 పరుగులకే కట్టడి చేసింది. 

ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఓపెనర్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ అద్భుత బ్యాటింగ్‌తో అలరించారు. హిట్‌మ్యాన్‌ 76 పరుగులు, గబ్బర్‌ 31 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో ఏకంగా 10 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. 

కాగా దాదాపు ఆరేళ్ల తర్వాత వన్డే మ్యాచ్‌లో భారత జట్టు ఈ విధంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందడం విశేషం. చివరిసారిగా 2016లో జింబాబ్వే మీద టీమిండియా ఈ రకమైన గెలుపు నమోదు చేసింది. 

మరోవైపు.. ఇంగ్లండ్‌కు సొంతగడ్డ మీద వన్డేల్లో ఇలాంటి ఘోర పరాభవం ఎదురుకావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో బట్లర్‌ బృందం పేరిట చెత్త రికార్డు నమోదైంది. ఇక మొదటి వన్డేలో విజయంతో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది.

వన్డేల్లో 10 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందిన సందర్భాలు
ఈస్ట్‌ ఆఫ్రికా మీద- లీడ్స్‌లో- 123/0- 1975
శ్రీలంక మీద- షార్జాలో- 97/0- 1984
వెస్టిండీస్‌ మీద- పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌- 116/0- 1997
జింబాబ్వే మీద- షార్జా-197/0- 1998
కెన్యా మీద- బ్లూమ్‌ఫొంటేన్‌- 91/0-2001
జింబాబ్వే మీద- హరారే- 126/0- 2016
ఇంగ్లండ్‌ మీద- ది ఓవల్‌- 114/0- 2022

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ 2022 వన్డే సిరీస్‌- మొదటి వన్డే:
టాస్‌: ఇండియా- బౌలింగ్‌
ఇంగ్లండ్‌ స్కోరు:  110 (25.2)
ఇండియా స్కోరు: 114/0 (18.4)
విజేత: ఇండియా- 10 వికెట్ల తేడాతో గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: జస్‌ప్రీత్‌ బుమ్రా(7.2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు)

చదవండి: Jasprit Bumrah: బుమ్రా అరుదైన రికార్డు.. టీమిండియా తరపున మూడో బౌలర్‌గా
Womens ODI Rankings: టాప్ 10లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌.. మెరుగైన కెప్టెన్‌ ర్యాంక్‌

మరిన్ని వార్తలు