IND Vs ENG 3rd Test Day 3: భారత్‌ 215/2, క్రీజులో పుజారా(91), కోహ్లి(45)

27 Aug, 2021 23:19 IST|Sakshi

మూడో రోజు ముగిసిన ఆట..139 పరుగుల వెనుకంజలో భారత్‌..!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకు ఆలౌట్‌ అవ్వగా..బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ జట్టు 354 పరుగుల భారీ లీడ్‌ను భారత జట్టు ముందుంచింది. రెండో ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌చేసిన టీమిండియాకు రాహుల్‌ రూపంలో షాక్‌ తగిలింది. కేవలం 8 పరుగుల వద్ద రాహుల్‌ ఔటయ్యాడు. తరువాత వన్‌డౌన్‌లో వచ్చిన పుజారా, రోహిత్‌ ద్వయం 82 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేయగా..రోహిత్‌ శర్మ అర్థ సెంచరీ ముగించుకున్నాక 59 పరుగుల వద్ద రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, పూజారా ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోంటు పరుగులను రాబట్టారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో పూజారా(91 పరుగులు, 15 ఫోర్లు), విరాట్‌ కోహ్లీ (45 పరుగులు, 6ఫోర్లు) ఉన్నారు. భారత్‌ ఇంకా 139 పరుగుల వెనుకబడి ఉంది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ స్కోర్‌-215/2, ఇంగ్లండ్‌ బౌలింగ్‌లో రాబిన్‌సన్‌, ఓవర్‌టన్‌ చెరో వికెటును తీశారు. ఇంకా రెండురోజుల ఆట మిగిలి ఉంది. 

నిలకడగా ఆడుతున్న పుజారా(81), కోహ్లి(32)
టీమిండియా నయా వాల్‌ పుజారా(81; 14 ఫోర్లు) చాలా రోజు తర్వాత తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. అతనికి మరో ఎండ్‌లో కెప్టెన్‌ కోహ్లి(33; 5 ఫోర్లు) కూడా సహకరిస్తుండడంతో టీమిండియా ప్రత్యర్ధి ఆధిక్యాన్ని క్రమంగా తగ్గిస్తూ వస్తుంది. 73 ఓవర్ల తర్వాత టీమిండియా 2 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 164 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 

పుజారా హాఫ్‌ సెంచరీ.. టీమిండియా స్కోర్‌ 123/2
గత 11 ఇన్నింగ్స్‌లుగా కనీసం అర్ధసెంచరీ కూడ సాధించకుండా వరుసగా విపలమవుతున్న పుజారా ఎట్టకేలకు హాఫ్‌ సెంచరీ సాధించాడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు సంయమనంగా బ్యాటింగ్‌ చేస్తూ.. ఇంగ్లండ్‌ లీడ్‌ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. 52 ఓవర్ల తర్వాత ఇండియా స్కోర్‌ 123/2. క్రీజ్‌లో పుజారాకు తోడుగా కోహ్లి(1) ఉన్నాడు. ప్రస్తుతం భారత్‌ ఇంకా 228 పరుగులు వెనుకపడి ఉంది.  

టీమిండియాకు షాక్‌.. రాబిన్సన్‌కు దొరికిపోయిన హిట్‌మ్యాన్‌(59)
భారీ స్కోర్‌ దిశగా సాగుతున్న హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ(59; 7 ఫోర్లు, సిక్స్‌)ను రాబిన్సన్‌ బోల్తా కొట్టించాడు. వికెట్లకు స్ట్రయిట్‌గా వస్తున్న బంతిని డిఫెన్స్‌ ఆడబోయి రోహిత్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో టీమిండియాకు పెద్ద షాక్‌ తగిలినంత పనైంది. 48 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 116/2. క్రీజ్‌లో పుజారా(44), కోహ్లి(0) ఉన్నారు. టీమిండియా ప్రసుతం మరో 238 పరుగులు వెనుకపడి ఉంది.   

రోహిత్‌ శర్మ ఫిఫ్టి.. నిలకడగా ఆడుతున్న పుజారా(34)
టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(52; 6 ఫోర్లు, సిక్స్‌) హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి దృడ సంకల్పంతో బ్యాటింగ్‌ చేస్తున్న రోహిత్‌.. భారీ ఇన్నింగ్స్‌ ఆడి ఎలాగైనా టీమిండియాను గట్టెక్కించాలని భావిస్తున్నాడు. అతనికి మరో ఎండ్‌ నుంచి పుజారా(36; 7 ఫోర్లు) రూపంలో చక్కటి సహకారం లభిస్తుంది. 42 ఓవర్ల తర్వాత టీమిండియా వికెట్‌ నష్టానికి 101 పరుగులు చేసింది. ప్రస్తుతం మరో 253 పరుగులు వెనుకపడి ఉంది.

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. కేఎల్‌ రాహుల్‌(8) ఔట్‌
354 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోర్‌ 34 పరుగుల వద్ద ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(8)..ఒవర్టన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సెకెండ్‌ స్లిప్‌లో బెయిర్‌స్టో అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో రాహుల్‌ పెవిలియన్‌ బాట పట్టక తప్పలేదు. ప్రస్తుతం టీమిండియా మరో 320 పరుగులు వెనుపడి ఉంది. ప్రస్తుతం అంపైర్లు లంచ్‌ విరామం ప్రకటించారు. క్రీజ్‌లో రోహిత్‌ శర్మ(25) ఉన్నాడు. 

ఇంగ్లండ్‌ 432 ఆలౌట్‌.. 354 పరుగుల ఆధిక్యంలో ఆతిధ్య జట్టు
మ్యాచ్‌ ఆరంభం నుంచి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన బుమ్రా.. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ రాబిన్సన్‌(0)ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 432 పరుగుల వద్ద ముగిసింది. ఇంగ్లండ్‌కు 354 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు పడగొట్టగా, సిరాజ్‌, జడేజా, బుమ్రాలకు తలో రెండు వికెట్లు దక్కాయి. 

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. ఒవర్టన్‌(32) ఔట్‌
మూడో రోజు ఆట తొలి ఓవర్‌లోనే రెండు బౌండరీలతో విరుచుకుపడిన ఒవర్టన్‌(32; 6 ఫోర్లు) ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 8 పరుగులు మాత్రమే జోడించి షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 132 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ 9 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 353 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజ్‌లో రాబిన్సన్‌(0), ఆండర్సన్‌(0) ఉన్నారు.

లీడ్స్‌: ఓవర్‌నైట్‌ స్కోర్‌ 423/8తో ఇంగ్లండ్‌ జట్టు మూడో రోజు ఆటను ఆరంభించింది. క్రీజులో క్రెయిగ్‌ ఒవర్టన్‌(24), ఓలీ రాబిన్సన్‌ (0) ఉన్నారు. ఇంగ్లండ్‌ బ్యాట్‌మెన్లు తొలి రోజునుంచి భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. మధ్యమధ్యలో వికెట్లు తీయడం మినహా భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ప్రస్తుతానికి ఇంగ్లండ్‌ 345 పరుగుల ఆధ్యిక్యంలో కొనసాగుతుంది. కాగా, టీమిండియా తొల ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. అనంతరం ఇంగ్లండ్‌ కెప్టెన్‌ రూట్‌(121) అద్భుత శతకంతో చెలరేగగా, బర్న్స్‌(61), హమీద్‌(66), మలాన్‌(70) అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో షమీ 3, సిరాజ్‌, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

>
మరిన్ని వార్తలు