IND Vs ENG 4th Test: 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా.. లేక మళ్లీ ఘోర పరాభవం తప్పదా..?

6 Sep, 2021 15:05 IST|Sakshi

ఓవల్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ రసవత్తరంగా మారింది. ఇరు జట్లను విజయం ఊరిస్తోంది. టీమిండియా గెలవాలంటే చివరి రోజు పది వికెట్లు తీయాల్సిన పరిస్థితి ఏర్పడంది. మరోవైపు ఇంగ్లండ్‌ విజయానికి మరో 291 పరుగుల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో చివరి రోజు ఆట థ్రిల్లర్‌ను తలపించడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే మాత్రం 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుంది. ఓవల్‌లో భారత్ గత 50 ఏళ్లుగా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. ఈ మైదానంలో భారత్ చివరి సారిగా 1971లో గెలిచింది. ఆ మ్యాచ్‌లో అజిత్ వాడేకర్ సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించింది. అదే ఈ మైదానంలో భారత్ అందుకున్న చివరి విజయం.

ఆ తర్వాత టీమిండియా 8 మ్యాచ్‌లు ఆడిన ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. వరుసగా 5 మ్యాచ్‌లను చేసుకున్న భారత జట్టు గత మూడు పర్యటనల్లో(2011, 2014, 2018) ఘోర పరాజయాలను చవి చూసింది. 2011లో ఇన్నింగ్స్, 8 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. 2014 టూర్‌లో ఇన్నింగ్స్ 244 రన్స్‌తో చిత్తయింది. 2018 పర్యటనలో 118 రన్స్ తేడాతో ఓటమిపాలైంది.
చదవండి: 'రహానేను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసింది'

>
మరిన్ని వార్తలు