Rishabh Pant Century: పంత్‌ సెంచరీ... సాధారణంగా ద్రవిడ్‌ ఇలా రియాక్ట్‌ అవ్వడు! వైరల్‌ వీడియో!

2 Jul, 2022 11:38 IST|Sakshi
పంత్‌ సెంచరీ- ద్రవిడ్‌ రియాక్షన్‌ వైరల్‌(PC: Sony Sports Network Twitter)

India Vs England 5th Test- Rishabh Pant- Rahul Dravid: రిషభ్‌ పంత్‌.. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌కు సారథ్యం వహించి కెప్టెన్‌గా శెభాష్‌ అనిపించుకున్నా.... బ్యాటర్‌గా మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలో పంత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. రానున్న టీ20 ప్రపంచకప్‌-2022 జట్టులో చోటు కూడా ఇవ్వకూడదంటూ పలువురు మాజీ క్రికెటర్లు పంత్‌ ఆట తీరుపై విరుచుకుపడ్డారు. 

కట్‌ చేస్తే.. ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టులో రిషభ్‌ పంత్‌ తనదైన శైలిలో అద్భుతంగా రాణించాడు. టీ20 ఫార్మాట్‌ సంగతి ఎలా ఉన్నా టెస్టుల్లో తన తరహా ఇన్నింగ్స్‌తో జట్టును పటిష్ట స్థితిలో నిలిపి అందరి చేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి టీమిండియా క్లిష్ట పరిస్థితిలో ఉన్న వేళ శతకంతో రాణించాడు. రవీంద్ర జడేజా మరో ఎండ్‌లో సహకారం అందిస్తుండగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 

అయితే, పంత్‌పై విమర్శలు వచ్చిన సమయంలో టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అతడికి అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు పంత్‌. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో 111 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 146 పరుగులు చేశాడు. దీంతో ద్రవిడ్‌ సంతోషంతో ఉప్పొంగిపోయాడు.

డగౌట్‌లో కూర్చుని మ్యాచ్‌ వీక్షిస్తున్న ద్రవిడ్‌ ఒక్కసారిగా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో చిరునవ్వులు చిందిస్తూ పంత్‌ను అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. 

ఇక పంత్‌ సెంచరీ ఇన్నింగ్స్‌పై ద్రవిడ్‌ రియాక్షన్‌ గురించి టీమిండియా మాజీ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ‘‘క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి అద్భుతమైన ఇన్నింగ్స్‌ చూసినపుడు ఎవరికైనా భావోద్వేగాలు నియంత్రించుకోవడం కష్టమే. సాధారణంగా ద్రవిడ్‌ ఎప్పుడూ ఇలా రియాక్ట్‌ అవ్వడు’’ అని క్రిక్‌బజ్‌ షోలో వ్యాఖ్యానించాడు.

చదవండి: MS Dhoni Knee Problem: మోకాలి నొప్పులతో బాధపడుతున్న ధోని.. ట్రీట్‌మెంట్‌ ఖర్చు 40 రూపాయలు!
Ind Vs Eng 5th Test: అసలు అంచనాలే లేవు... అయినా కూడా నువ్వు మరోసారి! ఎన్నాళ్లో ఇలా?

మరిన్ని వార్తలు