Ind Vs Eng 5th Test: అసలు అంచనాలే లేవు... అయినా కూడా నువ్వు మరోసారి! ఎన్నాళ్లో ఇలా?

1 Jul, 2022 20:31 IST|Sakshi
విరాట్‌ కోహ్లి(PC: ECB)

India Vs England 5th Test: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. ఇంగ్లండ్‌తో రీ షెడ్యూల్డ్‌ టెస్టులో అతడు విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌ యువ బౌలర్‌ మాథ్యూ పాట్స్‌ బంతికి బౌల్డ్‌ అయ్యాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 19 బంతులు ఎదుర్కొని కోహ్లి చేసిన స్కోరు 11 పరుగులు. 

దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ‘‘పెద్దగా అంచనాలేమీ పెట్టుకోలేదు.. అయినా నువ్వు మరోసారి మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచావు. మా గుండె పగిలింది కోహ్లి. అయినా గత కొన్ని నెలలుగా మాకిది అలవాటు అయిందిలే!’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్నాళ్లు నీ తరహా సూపర్‌ ఇన్నింగ్స్‌ కోసం ఎదురుచూడాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు నెటిజన్లు కోహ్లి ఫ్యాన్స్‌ పరిస్థితి ఇప్పుడు ఇదిగో ఇలా ఉంటుంది అంటూ మీమ్స్‌తో ట్రోల్‌ చేస్తున్నారు. కాగా గతేడాది ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా కోహ్లి భారత కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, కరోనా కారణంగా వాయిదా పడ్డ ఆఖరిదైన ఐదో టెస్టును తాజాగా నిర్వహిస్తుండగా.. బుమ్రా సారథ్యం వహిస్తున్నాడు. ఇక దాదాపు రెండున్నరేళ్లుగా కోహ్లి ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం.

చదవండి: India Vs England ODI - T20 Series: టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్‌ ‘జట్ల’ ప్రకటన.. వారిద్దరి ఎంట్రీ!

>
మరిన్ని వార్తలు