Jasprit Bumrah: 100 వికెట్లతో బుమ్రా అరుదైన రికార్డు.. విదేశీ గడ్డపై..

5 Jul, 2022 10:33 IST|Sakshi
జస్‌ప్రీత్‌ బుమ్రా(PC: ICC)

India Vs England 5th Test: టీమిండియా స్టార్‌ పేసర్‌, తాత్కాలిక కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. సేనా దేశాల్లో(సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) టెస్టుల్లో వంద వికెట్లు పడగొట్టిన ఆరో భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రీషెడ్యూల్డ్‌ టెస్టులో ఓపెనర్‌ జాక్‌ క్రాలేను అవుట్‌ చేసి ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. 

కాగా బుమ్రా ఇప్పటి వరకు ఇంగ్లండ్‌ గడ్డపై 36, ఆస్ట్రేలియాలో 32, న్యూజిలాండ్‌లో ఆరు, సఫారీ గడ్డపై 26 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఈ సేనా దేశాల్లో 100 వికెట్లు తీసిన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. 

కాగా బుమ్రా కంటే ముందు కపిల్‌ దేవ్‌, ఇషాంత్‌ శర్మ, జహీర్‌ ఖాన్‌, మహ్మద్‌ షమీ, అనిల్‌ కుంబ్లే ఈ ఘనత సాధించారు. ఇక రోహిత్‌ శర్మ కోవిడ్‌ కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టుకు బుమ్రా కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.

ఇక ఈ మ్యాచ్‌లో మూడో రోజు వరకు టీమిండియా ఆధిక్యం కనబరచగా.. నాలుగోరోజు అంతా తలకిందులైంది. చేతిలో 7 వికెట్లు ఉన్న ఇంగ్లండ్‌ చివరి రోజు మరో 119 పరుగులు చేస్తే చాలు! మ్యాచ్‌ టీమిండియా చేజారుతుంది. అలాగే సిరీస్‌ సమమవుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా నాలుగో రోజు ఆట వరకు మొత్తంగా 5 వికెట్లు పడగొట్టాడు.

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ ఐదో టెస్టు స్కోర్లు:
►టీమిండియా తొలి ఇన్నింగ్స్‌: 416 ఆలౌట్‌
►ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 284 ఆలౌట్‌
►టీమిండియా రెండో ఇన్నింగ్స్‌: 245 ఆలౌట్‌
►ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 259/3.

చదవండి: IND VS ENG: తొలి టీ20కి కోచ్‌గా లక్ష్మణ్.. ద్రవిడ్‌కు ఏమైంది..?

మరిన్ని వార్తలు